E-Paper
Advertisement

Divya Pahuja : 11 రోజుల తర్వాత దివ్య పాహుజా మృతదేహం లభ్యం.. అందుకే హత్య చేశారా?

Divya Pahuja : 11 రోజుల తర్వాత దివ్య పాహుజా మృతదేహం లభ్యం.. అందుకే హత్య చేశారా?
Advertisement

Divya Pahuja : మాజీ మోడల్‌ దివ్య పాహుజా హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 2న గురుగ్రామ్‌లోని హోటల్‌లో కొందరు వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు. మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. హోటల్‌ యజమాని అభిజీత్‌ సింగ్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేశారు.

అప్పటి నుంచి ఆమె మృతదేహం కోసం పోలీసులు గాలించారు. 11 రోజుల తర్వాత హర్యానాలోని ఓ కాలువలో మృతదేహన్ని గుర్తించారు. హత్య జరిగిన తర్వాత దివ్య శవాన్ని నిందితులు పంజాబ్‌లోని భాఖ్‌డా కెనాల్‌లో పడేశారని పోలీసులు వెల్లడించారు. అలా నీటిలో మృతదేహం హర్యానాకు కొట్టుకొచ్చినట్లు తెలిపారు. తొహానా జిల్లాలోని కాలువ నుంచి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తన అభ్యంతకర ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నందువల్లే దివ్యను చంపానని అభిజీత్‌ విచారణలో చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. ఐదుగురు వ్యక్తులు ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి తుపాకీతో కాల్చారని గుర్తించారు.

హర్యానాలో గ్యాంగ్‌స్టర్‌ సందీప్‌ గడోలీతో దివ్యకు సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు . 2016లో ముంబయిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సందీప్‌ మరణించాడు. సందీప్‌ ప్రత్యర్థి అయిన బిందర్‌ గుజ్జర్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ హర్యానా పోలీసులతో కుమ్మక్కై నకిలీ ఎన్‌కౌంటర్‌ చేయించాడని తేలింది. బిందర్‌ కుట్రలో భాగంగానే సందీప్‌ను ఆమె అక్కడికి తీసుకువచ్చిందని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమె ఏడేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించిందని పోలీసులు వెల్లడించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×