BigTV English

Manipur : స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం.. మణిపూర్ లో వెలుగులోకి మరో దారుణ ఘటన..

Manipur : స్వాతంత్య్ర  సమరయోధుడి భార్య సజీవ దహనం.. మణిపూర్ లో వెలుగులోకి మరో దారుణ ఘటన..

Manipur : మణిపూర్‌లో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన బయటకు వచ్చింది. స్వతంత్ర సమరయోధుడి భార్యను అల్లరి మూకలు సజీవ దహనం చేశాయి. ఈ దారుణ ఘటన మే 28న కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో జరిగిందని కథనాలు వచ్చాయి. ఆ రోజు స్వతంత్ర సమరయోధుడు చురాచాంద్‌ సింగ్‌ భార్య సోరోకైబామ్‌ ఇబెటోంబిని దుండగులు సజీవ దహనం చేశారు.


80 ఏళ్ల ఇబెటోంబి ఇంట్లో ఉండగానే దుండగులు గడియ పెట్టారు. ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఆమెను రక్షించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా అప్పటికే ఇల్లు మొత్తం దగ్ధమైంది. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్‌కాంత్ తెలిపాడు. ఆ సమయంలో తాను త్రుటిలో తప్పించుకున్నానని వివరించాడు. తమపై కాల్పులు జరిగాయని చెయ్యి, కాలులోకి తూటాలు దూసుకుపోయాయని ఆ దారుణ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇబెటోంబి భర్త చురచాంద్‌ సింగ్‌ దేశానికి చేసిన సేవలకుగాను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ నుంచి సత్కారం అందుకొన్నారు.

ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో సెరో గ్రామం ఉంది. ఎంతో సుందరంగా ఉండే ఆ గ్రామంలో ప్రస్తుతం కాలిన గృహాలే దర్శనమిస్తున్నాయి. కుకీ-మైతేయ్‌ ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతింది ఈ గ్రామం. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఈ గ్రామం నుంచి ప్రజలు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. దీంతో సెరో గ్రామం నిర్మానుష్యంగా మారిపోయింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×