
animals : మానవులతో జంతువుల చెలిమి ఈ నాటిది కాదు. తొలుత వాటిని ఆహారం కోసం, పనుల కోసం చేరదీశారు. విశ్వాసంగా ఉంటూ మానవ జీవితాల్లో భాగమైపోయాయి. మనుషులు, జంతువుల మధ్య సుదృఢమైన అనుబంధానికి ప్రతీకలెన్నో. వాటిలో ముఖ్యమైనవి శునకాలు. మానవులతో వాటి చెలిమి 30 వేల సంవత్సరాల నాటిది.
సైనికులను రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది గేండర్. కెనడా న్యూఫౌండ్ ల్యాండ్‌కు చెందిన ఈ శునకం కెనడా సైన్యంలో ఉండేది. గ్రెనేడ్ నోట కరుచుకుని దూరంగా తీసుకెళ్లి విసిరేసింది. సైనికుల ప్రాణాలను కాపాడింది. రెండో ప్రపంచ యుద్ధంలో హీరోగా నిలిచింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో సాజెంట్ స్టబ్బీ అందించిన సేవలు అమూల్యమైనవి. జర్మన్ సైనికుడిని పట్టించిందీ సాహస శునకం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో థెరపీ డాగ్‌గా విశిష్ట సేవలు అందించింది స్మోకీ. యార్క్‌షైర్ చెందిన ఈ డాగ్ 150 వైమానిక దాడుల నుంచి తప్పించుకుంది.
మొదటి ప్రపంచ యుద్ధంలో చెర్ అమీ కీలక వేగు. తీవ్రంగా గాయపడినా.. 200 మంది సైనికులను రక్షించేలా ఓ కీలక మెసేజ్‌ను పంపిందా పావురం. జపాన్‌కు చెందిన హచికో విధేయతకు మారుపేరు. యజమాని పట్ల అమిత విశ్వాసంతో ఉండేది. ఆయన చనిపోయినా.. ప్రతి రోజూ రైల్వేస్టేషన్‌లో ఎదురుచూసింది. అలా పదేళ్లు రోజూ రైల్వేస్టేషన్‌కు వచ్చి యజమాని కానరాక నిరాశతో తిరిగి వెళ్లేది.
అలస్కాలోని నోమ్ నగరాన్ని 1925లో డిఫ్తీరియా కుదిపేసింది. సైబీరియన్ శునకమైన బాల్టో.. స్లెడ్ డాగ్ టీం సారథి.
ఆ బృందంతో కలిసి మంచుతుఫానులో నోమ్ సిటీకి మందులను చేరవేసింది. డిఫ్తీరియా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించింది. సోవియట్ యూనియన్ తొలిసారిగా చంద్రుడిపైకి ఓ శునకాన్ని పంపింది. దాని పేరు లైకా. ఆ మిషన్‌లోనే ప్రాణాలొదిలింది. లైకా చేసిన ప్రాణత్యాగం వల్లే.. అనంతర కాలంలో మానవులు జాబిల్లిపైకి కాలు మోపడం సాధ్యం కాగలిగింది.