BigTV English

Delhi: ఓర్నీ.. ఏకంగా మహిళా ఎంపీ గొలుసు కొట్టేసిన దొంగ

Delhi: ఓర్నీ.. ఏకంగా మహిళా ఎంపీ గొలుసు కొట్టేసిన దొంగ

Delhi: దొంగలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. సామాన్యులకే కాదు చివరకు ఎంపీలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో ఎంపీ గోల్డ్ చైన్‌ని దొంగలించారు.ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇలాంటి ఘటన జరగడంతో ఎంపీలు షాకవుతున్నారు? అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలంతా హిస్తనలో ఉన్నారు. తమిళనాడుకి చెందిన కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ వార్తల్లోకి వచ్చారు. ఢిల్లీలో మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా వెనకనుంచి బండి మీద వచ్చిన దొంగలు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. సోమవారం ఉదయం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని మయిలాదుతురై నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు సుధ. డీఎంకేకు చెందిన ఓ నాయకురాలుతో కలిసి చాణక్యపురి ప్రాంతంలోని పోలండ్ ఎంబసీ సమీపంలో మార్నింగ్ వాక్  చేస్తున్నారు. ఆ  సమయంలో ఆమె మెడలో చైన్‌ను దొంగలు లాక్కుపోయారు. పోలీసులకు ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదులో ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావించారు.


ఈ వ్యవహారంపై హోంమంత్రి అమిత్‌షా‌కు ఆమె లేఖ రాశారు. ఉదయం 6 గంటల సమయంలో హెల్మెట్‌ పెట్టుకొని టూ వీలర్‌పై ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి తన మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడని అందులో ప్రస్తావించారు. అతడు చైన్‌ స్నాచర్‌గా తాము అనుమానించలేదని పేర్కొన్నారు.

ALSO READ: ఆ 35 రకాల మందులపై ధరల తగ్గంపు, సామాన్యులకు భారీ ఊరట

బలంగా గొలుసు లాగడంతో మెడకు గాయాలయ్యాయని, డ్రెస్ కొద్దిమేరా డ్యామేజ్ అయినట్టు రాసుకొచ్చారు. కిందపడి పోకుండా ప్రయత్నం చేశానని, తామిద్దరం సహాయం కోసం ఎదురు చూశామని రాసుకొచ్చారు. కొద్దిసేపటికి అటువైపు పెట్రోలింగ్ వాహనం రావడంతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో మహిళా ఎంపీపై ఇలాంటి ఘటన జరగడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.  ఈ ప్రాంతంలో మహిళలు నడిచే పరిస్థితి లేకపోతే రోజూ వారీ పనులను ఎలా పూర్తి చేసుకోగలమని అన్నారు. గాయాలు మాత్రమే బంగారం గొలుసు పోయిందని లేఖలో పేర్కొన్నారు. వెంటనే న్యాయం జరిగేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హోంమంత్రికి రాసిన లేఖలో ప్రస్తావించారు.

ఎంపీ సుధా  ఘటన విషయం తెలిసి మిగతా ఎంపీలు షాకయ్యారు. దేశ రాజధానిలో ఈ విధంగా జరగడం దారుణమంటున్నారు. ఎంపీకే ఈ విధంగా జరిగితే మిగతావారికి రక్షణ ఎలా ఉంటుందని అంటున్నారు. ఢిల్లీలో నిత్యం సెక్యూరిటీ అలర్టుగా ఉంటుంది.

దీనికితోడు అడుగడుగునా సీసీకెమెరాలు నిఘా ఉంటాయి.  అలాంటి ప్రాంతంలో ఇలా జరగడం అంతుబట్టడం లేదు. మరోవైపు ఎంపీ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

 

Related News

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

Poonch sector firing: కాల్పులకు తెగబడ్డ పాక్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సైన్యం!

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Cloud Burst: క్లౌడ్‌బరస్ట్ అంటే ఏమిటీ? ఊళ్లను వల్లకాడు చేసే ఈ విపత్తు.. సునామీ కంటే ప్రమాదకరమా?

Uttarakhand floods: ఉత్తరాఖండ్ వరదల ఎఫెక్ట్.. వందల సంఖ్యలో ప్రజల గల్లంతు?

Cloud Burst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్.. రెప్పపాటులో కొట్టుకెళ్లిపోయిన ఊరు.. భారీ సంఖ్యలో మరణాలు?

Big Stories

×