Viral Video: ఈ సమాజంలో మనిషిలో మానవత్వం లేకుండా పోతుంది. మనిషికి స్వార్థం, అభద్రత, అజ్ఞానం ప్రకృతి జీవాలపై ఎంతటి దారుణంగా ప్రభావం చూపుతోందో తరచూ మనం చూస్తూనే ఉంటాం. అటువంటి ఓ ఉదాహరణగా తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు పాముతో చేసిన క్రూరత్వం మానవత్వాన్ని ప్రశ్నించేలా మారింది. ఓ మూగ జీవిపై కనికరం లేకుండా జరిగిన ఈ ఘటనపై దేశమంతా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్తుంది.
ఒక పాము ఎంత పెద్దదైనా, ఎంత భయపడేలా ఉన్నా, అది మనుషుల్లా మాట్లాడదు. కానీ బాధ మాత్రం దానికి ఉంటుందని మనిషి మరిచిపోయాడు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని కాన్కేర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన, ఈ నిజాన్ని మరలా గుర్తు చేసింది.
ఒక యువకుడు తన బైక్‌కి సర్పాన్ని తాడుతో కట్టేసాడు. దాన్ని రోడ్డుపై లాగుతూ తీసుకెళ్తున్నాడు. బైక్ స్పీడ్ పెంచుతూ పామును నడిరోడ్డుపై తాగుతూ వెళుతుంటే ఆ మూగ జీవి విలవిల లాడుతూ నిర్జీవంగా ఉంది. అయితే బైక్ వెనుకాలే కారులో వెళుతున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఏ మనసైనా అయ్యో.. అనాల్సిందే. బైక్ నడుపుతున్న వ్యక్తికి కాస్తైన కనికరమూ లేదు. మూగజీవిని తాడుతో బైక్ కి కట్టేసి రోడ్డుపై తగుతూ వెళ్లడం చూసిన ప్రతి ఒక్కరు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో, ప్రజల నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పాముకీ జీవించే హక్కు ఉంది. ప్రాణహానిగా అనిపిస్తే అడవి శాఖ లేదా సర్పాల రిస్క్యూ టీమ్‌ని సంప్రదించొచ్చు కదా!” అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఇంకొకరు స్పందిస్తూ, “మనమే అడవుల్లోకి వెళ్లి, అక్కడి జీవులను వేధిస్తున్నాం. మనమే దోషులం” అన్నారు. మరొకరైతే ఛీ నువ్వు మనిషివేనా.. ఇతన్ని వెంటనే ARREST చేయాల్సిందే అంటూ మండిపడతున్నారు.
భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం – 1972 ప్రకారం, అటవీ జంతువులను వేధించడం, హింసించడం, చంపడం నేరంగా పరిగణించబడుతుంది. ఇది ప్రభుత్వ పరంగా శిక్షార్హమైన చర్య. అందుకే, ఈ వీడియో ఆధారంగా సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాములు మాట్లాడవు. వాటికి శబ్దాలు లేవు. కానీ వాటి బాధ అర్థమవుతుంది. మనం మనుషుల మధ్యే కాదు, ప్రకృతి జీవుల పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి. మన స్వార్థం కోసం, మన భయాల కోసం, ఓ జీవికి ఈ రకమైన క్రూరత్వం చూపడం మానవత్వానికి తగిన పని కాదు.