BigTV English

Goldy Brar : గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్‌ని టెర్రరిస్ట్‌గా ప్రకటించిన కేంద్రం.. సింగర్ మూసేవాలా హత్య కేసులో నిందితుడు

Goldy Brar : గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్‌‌ని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. కేంద్రంలోని హోం శాఖ సోమవారం యుఎపిఎ (UAPA)చట్ట ప్రకారం ఉగ్రవాదిగా అంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Goldy Brar : గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్‌ని టెర్రరిస్ట్‌గా ప్రకటించిన కేంద్రం.. సింగర్ మూసేవాలా హత్య కేసులో నిందితుడు

Goldy Brar : గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్‌‌ని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. కేంద్రంలోని హోం శాఖ సోమవారం యుఎపిఎ (UAPA)చట్ట ప్రకారం ఉగ్రవాదిగా అంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.


ఇటీవలే లఖ్ బీర్ సింగ్ లండాని కూడా కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. లఖ్ బీర్ సింగ్, గోల్డీ బ్రార్ ఇద్దరూ కెనెడా పౌరసత్వం తీసుకొని అక్కడే ఉంటున్నారు. వీరిద్దరూ కిడ్ న్యాపింగ్, దేశ సరిహద్దుల నుంచి డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్, లాంటి నేరాలలో నిందితులు. దేశంలోనే ప్రఖ్యాత గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయి గ్యాంగ్‌లో సభ్యుడు ఈ గోల్డీ బ్రార్. పంజాబీ సింగర్, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు సిద్దూ మూసేవాలా హత్యను తానే చేయించానంటూ ఇటీవల మీడియాలో గోల్డీ బ్రార్ ఒక వీడియో విడుదల చేశాడు.

గోల్డీ బ్రార్ అసలు పేరు సత్విందర్ సింగ్. 2017లో కెనెడాకు స్టూడెంట్ వీసాపై వెళ్లినం గోల్డీ బ్రార్.. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ అయిన బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్‌లో చేరాడు. కొనిన్న సంవత్సరాలపాటు అక్కడే ఉంటూ అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. ప్రస్తుతం గోల్డీ బ్రార్, లఖ్ బీర్ సింగ్ ఇద్దరూ కెనెడాలోని బ్రాంప్ టన్‌లో ఉన్నట్లు సమాచారం.


పంజాబ్‌కు చెందిన ఒక విద్యార్థి నాయకుడు విక్కీ ముద్దుఖేరాని సింగర్ సిద్దూ మూసేవాలా హత్య చేయించినందుకు ప్రతీకారంగా తాను మూసేవాలాను హత్య చేయించానని గోల్డీ బ్రార్ ఒక వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇంటర్ పోల్(అంతర్జాతీయ పోలీస్) గోల్డీ బ్రార్‌ని పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. భారత దేశంలో కూడా ఎన్ఐఏ సంస్థ గోల్డీ బ్రార్‌కు సన్నిహితులైన వారిని అరెస్టు చేసి విచారణ జరుపుతోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×