BigTV English

PM Modi : ప్రభుత్వం వ్యాపారం చేసే సంస్థ కాదు – ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi : ప్రభుత్వం వ్యాపారం చేసే సంస్థ కాదు – ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi : ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యాపారాలు చేయడం ప్రభుత్వ పని కాదని చెబుతున్న మోదీ.. దేశంలో అనేక పనికిరాని చట్టాలు మన అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయి అంటుంటారు. అలాగే.. కనిష్ట ప్రభుత్వం – గరిష్ట పాలన విధానమే ఉత్తమం అంటూ చెబుతున్న మోదీ.. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా.. వ్యాపార, ఇతర వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు డీ-రెగ్యూలేషన్ కమిషన్ ను నియమించనున్నట్లు వెల్లడించారు. ఈ కమిషన్ వివిధ అంశాలపై అధ్యయనం చేసి, ఆచరణాత్మక, గణనీయ మార్పులకు కావాల్సిన సూచలు చేస్తుందని తెలిపారు.


తమ మొదటి, రెండో పరిపాలనా కాలాల్లో ప్రభుత్వ అడ్డంకుల్ని తగ్గించేందుకు ప్రయత్నించినట్లు తెలిపిన ప్రధాని.. జన్ విశ్వాస్ 2.0 తో మరింత మెరుగ్గా ఈ పని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు డీ-రెగ్యులేషన్ కమిషన్ సూచనలిస్తుందని తెలిపారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ప్రసంగించిన మోదీ.. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే క్రమంలో ప్రైవేట్ రంగాన్ని కీలక భాగస్వామిగా చూడాలని, వ్యాపారం చేయాలంటే భయపడే పరిస్థితులు ఉండకూడదని అన్నారు. వ్యాపారులంతా పన్ను ఎగవేతదారులుగానో, తప్పు చేస్తున్న వాళ్లగానో పరిగణించి.. మితిమీరిన ఆంక్షల ఛట్రంలో వాళ్లను బంధించడం మంచి పద్దతి కాదన్నారు. వ్యాపారాలను సులభతరం చేసేందుకు చట్టాల్లోని సంక్లిష్టతలు, గజిబిజితనాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.

తాజాగా.. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను ఉపశమనం మధ్యతరగతిని బలోపేతం చేస్తుందని, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యతరగతికి మద్దతు ఇచ్చేందుకు.. పన్ను పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచినట్లు తెలిపారు. కీలక దేశాలు అయినా, అంతర్జాతీయ వేదికలైనా భారత్ పై విశ్వాసం గతంలో కంటే చాలా ఎక్కువగా పెరిగిందని మోదీ తెలిపారు. ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తుపై చర్చలకు కేంద్రంగా భారత్ మారిందన్న ప్రధాని మోదీ.. గతంలో ప్రభుత్వాలు సంస్కరణలు చేపట్టినప్పటికీ దృఢంగా అమలు చేయలేకపోయాయని అన్నారు. కానీ.. తన హయాంలో.. ప్రభుత్వం గట్టి సంకల్పంతో విప్లవాత్మక మార్పుల్ని అమలు చేస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటి తర్వాత స్వదేశానికి వచ్చిన మోదీ.. గత 10 ఏళ్లల్లో 25 కోట్ల మంది పౌరులు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.


కీలకమైన రంగాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యం కారణంగా.. అంతర్జాతీయ సమాజంతో పోటీ పడేలా అభివృద్ధి సాధించలేకపోయామన్న ప్రధాని.. ఈ కారణంగానే అంతరిక్షం నుంచి రక్షణ వరకు అనేక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడుల్ని అనుమతించినట్లు తెలిపారు. ఈ కీలకమైన రంగాల్లో స్టార్టప్‌లు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తున్నాయన్న మోదీ.. డ్రోన్ రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని అన్నారు.

Also Read : ప్రభుత్వ జీతాలతో ఉగ్రవాదులకు సేవలు – ఇన్నాళ్టికి వేటు

అలాగే.. విద్యుత్ పంపిణీ రంగంలోనూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో అణు రంగానికి ప్రైవేట్ భాగస్వాముల కోసం అనుమతులివ్వడాని అతిపెద్ద సంస్కరణగా చెప్పుకొచ్చారు. గత దశాబ్దం కాలంలోనే భారత్.. టాప్ 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలోకి ప్రవేశించిందని, ఇది వికసిత్ భారత్ అభివృద్ధి వేగానికి నిదర్శనమన్నారు. మరికొన్నేళ్లల్లోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని ప్రజలు చూస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×