BigTV English

Shilpa Shirodkar: టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న నమ్రత సోదరి.. ఏ సినిమాతో అంటే.?

Shilpa Shirodkar: టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న నమ్రత సోదరి.. ఏ సినిమాతో అంటే.?

Shilpa Shirodkar: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా సక్సెస్ అయిన అన్నలు చాలామంది తమ తముళ్లను కూడా హీరోగా చూడాలని ఆశపడుతుంటారు. కానీ అన్నలు సక్సెస్ అయినంతగా హీరోలు సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అన్నదమ్ముల విషయంలోనే కాదు.. అక్కాచెల్లెళ్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి. అక్క వచ్చి హీరోయిన్‌గా సక్సెస్ అయిన తర్వాత తన చెల్లిని హీరోయిన్‌గా లాంచ్ చేస్తుంది. కానీ ఇద్దరు ఒకే లెవెల్‌లో సక్సెస్ అయ్యింది మాత్రం చాలా అరుదు. మహేశ్ భార్య నమ్రత విషయంలో కూడా అదే జరిగింది. నమ్రత షిరోద్కర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత శిల్పా కూడా తన బాటలోనే వచ్చింది. యాక్టింగ్ మానేసిన ఇన్నాళ్ల తర్వాత టాలీవుడ్‌లో రీఎంట్రీకి సిద్ధమయ్యింది శిల్పా శిరోద్కర్.


అదే చివరి సినిమా

1989లో ‘భ్రష్టాచార్’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది శిల్పా శిరోద్కర్. ఆ తర్వాత 1990 ఒక్క ఏడాదిలోనే బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాల్లో నటించింది. అసలు నమ్రత కంటే శిల్పా శిరోద్కరే ఎక్కువ సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా పరిచయమయిన తర్వాత అతి కొన్నేళ్లలోనే ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది శిల్పా. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువయ్యింది. దాని వల్ల శిల్పాకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చివరిగా 2020లో విడుదలయిన ‘గన్స్ ఆఫ్ బనారస్’లో చివరిగా వెండితెరపై మెరిసింది శిల్పా శిరోద్కర్. దాని తర్వాత ఇంతకాలానికి మళ్లీ తెలుగు తెరపై రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది.


కొత్త ప్రారంభాలు

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘జటాధర’ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమయ్యింది. ఈ మూవీ పోస్టర్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టాలీవుడ్‌లో తన రీఎంట్రీ గురించి ప్రకటించింది శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar). దీంతో నమ్రత సోదరి తెలుగు రీఎంట్రీపై ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘కొత్త ప్రారంభం.. నేను నా తరువాతి ప్రాజెక్ట్ జటాధర్‌ను ప్రకటించడానికి చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ కథను రాసి, డైరెక్ట్ చేసినవాడు వెంకట్ కళ్యాణ్. ఈ ఎగ్జైటింగ్ జర్నీలో నాతో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఈ మూవీ పోస్టర్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది శిల్పా శిరోద్కర్. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు.

Also Read: నా మనవరాలు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కన్నా ఓకే.. జయ బచ్చన్ షాకింగ్ స్టేట్‌మెంట్

బిగ్ బాస్‌తో రీఎంట్రీ

సుధీర్ బాబు (Sudheer Babu) కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘జటాధర’ (Jatadhara). ఇటీవల హిందీలో బిగ్ బాస్ సీజన్ 18లో కంటెస్టెంట్‌గా కనిపించి మరోసారి ప్రేక్షకుల దృష్టిలో పడింది శిల్పా శిరోద్కర్. ఇందులో తను విన్నర్ అవ్వకపోయినా తన ఆటతీరు మాత్రం చాలామందికి నచ్చింది. ఎలాగో బిగ్ బాస్‌లో కనిపించడం వల్ల మరోసారి ఫేమ్ రావడంతో శిల్పాను తమ సినిమాల్లో క్యాస్ట్ చేసుకోవడానికి కూడా చాలామంది మేకర్స్ ఆలోచిస్తున్నారు. ‘జటాధర’ తన సెకండ్ ఇన్నింగ్స్‌కు బిగినింగ్ మాత్రమే అని ఆడియన్స్ అనుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×