వేసవిలో మంచినీటి కొరత ఎంత తీవ్రంగా ఉంటుందో మనందరికీ తెలుసు. పల్లెటూళ్లలో కూడా నీటికి కరువొస్తుంది, ఇక పట్టణాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కోడానికి ప్రభుత్వాలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటాయి. అయితే ఆ ట్యాంకర్లు అవసరం ఉన్నవారి దగ్గరకు వెళ్తున్నాయా, లేక పక్కదారి పడుతున్నాయాా..? ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుకుని డ్రైవర్లు వాటిని పక్కదారి పట్టిస్తున్నారా..? సామాన్య ప్రజలకు అందాల్సిన నీటితో వ్యాపారం చేస్తున్నారా..? ఈ అనుమానాలన్నీ సహజమే. అయితే అనుమానాలను పక్కనపెట్టి ఒక ఉపాయం ఆలోచించింది ఢిల్లీ ప్రభుత్వం. వాటర్ ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకర్లు అమర్చింది.
వేసవిలో ఢిల్లీలో మంచినీటికి కరువొస్తుంది. ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి. అయితే ఈసారి వాటర్ ట్యాంకర్లపై అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. అవసరం ఉన్నవారికే నీరు చేేర విధంగా వాటికి జీపీఎస్ ట్రాకర్లను బిగించారు. నీటి సరఫరాను సక్రమంగా అందించడానికి 1,111 ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకర్లను అమర్చి వాటిని ప్రారంభించారు సీఎం రేఖా గుప్తా. నీటి వృధాను అరికడతామని, అదే సమయంలో సామాన్యులకు నీటి కష్టాలు తీరుస్తామని ఆమె హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నీటి సరఫరా సరిగా లేదని, పేదల నీటి కష్టాలను ఆమ్ ఆద్మీ పార్టీ పట్టించుకోలేదని అన్నారామె. ప్రధాని మోదీ సూచనలతో ఢిల్లీలో సామాన్యులకు మంచినీటిని అందిస్తున్నామని, అక్రమాలకు తావు లేకుండా నీటి సరఫరాపై నిఘా పెట్టామని చెప్పారామె.
Delhi CM @gupta_rekha will flag off over 1,000 𝐆𝐏𝐒-𝐞𝐧𝐚𝐛𝐥𝐞𝐝 water tankers today from the Nirankari ground in Burari in a major step to combat the worsening water crisis in the city.
These tankers will be deployed across the city, especially in the areas facing acute… pic.twitter.com/NDvcr45L8e
— All India Radio News (@airnewsalerts) April 20, 2025
ఈ విషయంలో ఆమ్ ఆద్మీ నుంచి విమర్శలు కూడా మొదలయ్యాయి. వాటర్ ట్యాంకర్లకు జీపీఎస్ వ్యవస్థ ఎప్పట్నుంచో ఉందని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొత్తగా చేసిందేంటని ప్రశ్నిస్తున్నారు ఆప్ నేతలు. కేవలం మోదీ ఫొటోల్ని మాత్రమే ట్యాంకర్లపై ముద్రించారని ఎద్దేవా చేశారు.
VIDEO | AAP Delhi state convenor Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) says, “The CM Rekha Gupta’s speech was funny. How can she lie this much? It’s on record that in 2015, it was announced that all water tankers would have GPS. I was the vice-chairman of the Jal Board in 2022. What… pic.twitter.com/ryW4T6YWaw
— Press Trust of India (@PTI_News) April 20, 2025
ఢిల్లీలో ప్రతి ఏడాదీ వేసవి కాలంలో వాటర్ ట్యాంక్ లతో నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జలమండలి ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తారు. అయితే మధ్యలో ట్యాంకర్లు చాలా వరకు పక్కదారి పడుతుంటాయి. పేదల బస్తీలకు వెళ్లాల్సిన ట్యాంకర్లు, పెద్దల అపార్ట్ మెంట్లకు చేరుతుంటాయి. అక్కడ ట్యాంకర్లకు రేటు కట్టి నీటిని అమ్మేస్తుంటారు. పేదలకోసం ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే ట్యాంకర్లు ఇలా పక్కదారి పట్టడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గతంలో అధికారులు నిఘా పెట్టినా ఫలితం లేదు. ఈ ఏడాది మాత్రం 1,111 ట్యాంకర్లకు ముందుగా జీపీఎస్ పరికరాల్ని అమర్చి వాటిని సీఎం ప్రారంభించారు. వాహనాల వేగం, అది చేరుకునే ప్రదేశం, కదలికల్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తామని అధికారులు అంటున్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
గతంలో హైదరాబాద్ లో కూడా ఇలాంటి జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు. నీటిని ట్యాంకర్లలో సరఫరా చేయాల్సిన పరిస్థితులు లేవు. ఒకవేళ నీటి ఎద్దడి మరింత పెరిగి ట్యాంకర్లలో దూర ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంటే.. కచ్చితంగా ట్యాంకర్లపై నిఘా పెట్టాల్సిన పరిస్థితి. హైదరాబాద్ అయినా, ఢిల్లీ అయినా నీటి సరఫరాలో పారదర్శకత ఉండాలంటే కచ్చితంగా జీపీఎస్ ఉండాల్సిందేనంటున్నారు.