Sampoornesh : టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో సూఫ్ కామెడీ స్టైల్ తో ప్రత్యేకమైన నటనను కనపరుస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించారు. 2014లో వచ్చిన హృదయ కాలేయం చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన సంపూర్ణేష్ తన హాస్య నటనతో, ప్రేక్షకుల నుండి ఆదరణను పొందాడు. వినూత్నమైన పాత్రలను ఎంచుకుంటూ విభిన్నమైన క్యారెక్టర్స్ లో నటిస్తూ తెలుగు సినిమాలో బర్నింగ్ స్టార్ గా ఎదిగారు. కొన్ని క్యారెక్టర్స్ సంపు మాత్రమే చేయగలడు అనే విధంగా నటించి మెప్పించారు. తాజాగా ఆయన సోదరా అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఆ సినిమా కథ అదే ..
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తెలుగు అగ్ర హీరోల సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. కరెంటు తీగ, బందిపోటు, సింగం సినిమాలలో, కామెడీ పాత్రలో కనిపించి మెప్పించారు. 2019లో కొబ్బరి మట్ట సినిమాతో మూడు పాత్రలో నటించి అబ్బురపరిచారు. ఇప్పుడు తాజాగా సోదరా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమా గురించి సంపు మాట్లాడుతూ..ఇప్పటిదాకా ఒక లెక్క,ఇక ముందు మరో లెక్క అని, ప్రజెంట్ సోదరా అనే సినిమాని ఏప్రిల్ 25వ తారీకు రిలీజ్ చేస్తున్నాము. ఇప్పటివరకు చూసిన సంపూర్ణేష్ బాబుగా కాకుండా ఇప్పుడు వెయిట్ ఉన్న క్యారెక్టర్ లో సంపుని చూడబోతున్నారు. మోహన్ అనే నూతన దర్శకునితో సినిమా చేస్తున్నాము. ఈ సినిమా అన్నదమ్ముల అనుబంధం ప్రధాన అంశంగా ఉంటుంది. నాతో పాటు బ్రదర్ గా సంజూష్ నటించారు. కథంతా బాగా నచ్చింది. అన్నదమ్ముల అనుబంధం గురించి ఒక స్పెషల్ సాంగ్ ఈ సినిమాలో ఉంటుంది. ఎమోషనల్ లవ్ కామెడీ మూవీ గా ఈ సినిమా రానుంది అని సంపూ తెలిపారు. సినిమాలో బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్న సంజూష్ మాట్లాడుతూ.. మా ఇద్దరి అన్నదమ్ముల ఎమోషన్స్ ఈ సినిమాలో కీలకంగా కనిపిస్తుంది. మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని మేము భావిస్తున్నాము. అన్నదమ్ములు అందరూ ఈ సినిమాకు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను అని సంజూష్ తెలిపారు.
సూఫ్ కామెడీ హీరో ..
సూఫ్ కామెడీ చేయడం అంత తేలిక కాదు కానీ, సంపూర్ణేష్ బాబు అవలీలగా సూఫ్ కామెడీతో సినిమాలలో నటిస్తున్నారు. హృదయ కాలేయం నుండి మార్టిన్ లూథర్ కింగ్ సినిమా వరకు విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు. సామాజిక కార్యకలాపాల్లోనూ ముందుండి, సహాయం చేయడం అతని ప్రత్యేకత. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లో రిలీజ్ కానుంది. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలతో మన ముందుకు రావాలని మరిన్ని వైవిధ్యమైన పాత్రలో నటించాలని, సంపు అభిమానులతో పాటు మనము కోరుకుందాం.
AR Rahman : ఎవరు బాధ్యులు.. AI మ్యూజిక్‌పై ఆస్కార్ విన్నర్ ఆవేదన