Krunal-Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Royal Challengers Bangalore vs Punjab Kings ) మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా ఆడింది. అయితే ఇదంతా పక్కకు పెడితే.. ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన జరిగింది. విరాట్ కోహ్లీ పరువు.. తీస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also REad: Bowling Action: ఎవడు మమ్మీ వీడు.. ఇలా బౌలింగ్ వేస్తున్నాడు.. అర్జెంట్ గా SRHలోకి తీసుకురండి
కోహ్లీ పరువు తీసిన కృనాల్ పాండ్యా
పంజాబ్ Kings వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బౌండరీ గేటు వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో కృనాల్ పాండ్యా బౌలింగ్ చేయడానికి వచ్చాడు. మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలోకి వచ్చిందని అందరూ గ్రహించేశారు. అటు కృనాల్ పాండ్యా కూడా వరుసగా వికెట్లు తీస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బౌండరీ గేటు వద్ద ఉన్న విరాట్ కోహ్లీని… ఏం చూస్తున్నావ్ అక్కడ నుంచి ఇటు సైడ్ రా అంటూ కెప్టెన్ కంటే దారుణంగా వ్యవహరించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న రెస్పెక్ట్ లేకుండా… అతనిపై దారుణంగా ప్రవర్తించాడు కృనాల్ పాండ్యా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… క్రునాల్ పాండ్యా పైన దారుణంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
కృనాల్ పాండ్యా పైన విరాట్ కోహ్లీ ఫాన్స్ సీరియస్
బౌండరీ గేటు వద్ద విరాట్ కోహ్లీని ఇన్సల్ట్ చేసిన… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. రెండు వికెట్లు తీసినంత మాత్రాన హీరో అయిపోయావా ? అంటూ ఓ రేంజ్ లో కృనాల్ పాండ్యాను ఆడుకుంటున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో సరిగా ఆడవా నువ్వు…? సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలను వణికిస్తున్న విరాట్ కోహ్లీని… ఉద్దేశిస్తూ అలా వ్యవహరిస్తావా కృనాల్ పాండ్యా ? అంటూ మండిపడుతున్నారు. ఇది ఇలా ఉండగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ తో రెచ్చిపోగా… ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్… కృనాల్ పాండ్యా కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన పాండ్యా 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అంటే ఇద్దరు ఆడవాళ్లు అద్భుతంగా ఈ మ్యాచ్లు ఆడి జట్టును గెలిపించారు.
krunal pandya, he is a BGT winning captain bro, please respect 😭😭pic.twitter.com/Yu5uisPQ9k
— 🐐 (@itshitmanera) April 20, 2025