E-Paper
Advertisement

పాత ప్రత్యర్థులే కొత్త మిత్రులు.. డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. రంగంలోకి ‘మిషన్ 360’ వ్యూహం!

పాత ప్రత్యర్థులే కొత్త మిత్రులు.. డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. రంగంలోకి ‘మిషన్ 360’ వ్యూహం!
Advertisement

Delimitation Bill: దేశంలో రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై మరోమారు చర్చ మెుదలైంది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింపజేయాలని మోదీ సర్కార్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీ ఎంపీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ అధినాయకత్వం వ్యహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ‘మిషన్ 360’ వ్యాహాన్ని బీజేపీ చేపట్టినట్లు తెలుస్తోంది. బిల్లుకు కావాల్సిన 360 ఎంపీల మద్దతు పొందేందుకు బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది.

డీఎంకే, ఎన్సీపీ మద్దతుపైనే ఆశలు

గతంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన తమిళనాడులోని డీఎంకే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు ఈసారి తమ వైఖరిని మార్చుకోవడంపైనే కేంద్రం ఆశలు పెట్టుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లను 50 శాతం పెంచే నిబంధనను బిల్లు ముసాయిదాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడమే ఈ రెండు పార్టీల మనసు మారడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ 50 శాతం పెంపు నిబంధన తమ అభ్యంతరాలను తొలగిస్తుందని ఇరు పార్టీలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ఈ క్రమంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని శరద్ పవార్ ఇప్పటికే తమ 8 మంది ఎంపీలకు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

తమిళనాడు వాటాపై డీఎంకే పట్టు

Advertisement

తమిళనాడులో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని ‘ఇండియా’ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత డీఎంకే వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే డీలిమిటేషన్ బిల్లుపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే పునర్విభజన తర్వాత కూడా పార్లమెంట్ సీట్లలో తమిళనాడుకు ఉన్న 7.2 శాతం వాటా ఏమాత్రం తగ్గకూడదని ఆ పార్టీ కోరుతోంది. బిల్లులో 50 శాతం సీట్ల పెంపు నిబంధనను చేర్చితే బిల్లుకు మద్దతు తెలిపేందుకు తమకు ఎలాంటి సమస్య ఉండదని డీఎంకే కేంద్రానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. .

గత ఓటింగ్ అనుభవాలు..

వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 17న డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి ఓటింగ్ జరగ్గా.. అవసరమైన సభ్యుల మద్దతు లేకపోవడంతో అది వీగిపోయింది. అప్పట్లో సభలో 528 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనగా.. బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. మూడింట రెండొంతుల మెజారిటీకి 352 ఓట్లు అవసరం కాగా.. 54 ఓట్ల తేడాతో బీజేపీ వెనుకబడింది. అయితే ఈసారి లోక్‌సభలో పూర్తి స్థాయి హాజరు (540 మంది) ఉంటే 360 ఓట్లు అవసరమవుతాయి. ఒకవేళ ఎంపీలు గైర్హాజరైతే ఆ సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఎన్డీయే బలం.. ఇతర పార్టీల మద్దతు

Advertisement

ప్రస్తుతం ఎన్డీయే కూటమికి లోక్ సభలో 319 మంది ఎంపీల బలం ఉంది. ఇందులో బీజేపీ 241, టీడీపీ 16, శివసేన (షిండే) 13, జేడీయూ 12, ఎల్‌జేపీ 5, జనసేన 2 ఉన్నాయి. ఇది కాకుండా తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎన్సీపీఐ (NCPI) పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు.. ఈ వారమే తిరిగి ఎన్డీయే గూటికి చేరిన శిరోమణి అకాలీదళ్ ఎంపీ ఒకరు ఉన్నారు. 50 శాతం హామీ నేపథ్యంలో బిల్లుకు మద్దతిస్తామని ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పష్టం చేశారు. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు కలిస్తే బలం 328కి చేరుతుంది. డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు తోడైతే ఆ సంఖ్య 350కి పెరుగుతుంది. అయినప్పటికీ ప్రత్యేక మెజారిటీకి ఇంకా 10 ఓట్లు తగ్గుతాయి.

ఎన్డీఏకు వైసీపీ మద్దతు

మరోవైపు డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ప్రకటించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. గతంలో జరిగిన ఓటింగ్ సమయంలోనూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బిల్లుకు సానుకూలంగా ఓటు వేశారు. ఈసారి కూడా బిల్లుకు వైసీపీ సపోర్ట్ చేస్తే కేంద్ర బలం 354కి చేరుతుంది. దీంతో పాటు అసోంలోని మాజీ మిత్రపక్షం యూపీపీఎల్ (UPPL) ఎంపీ, గతంలో మద్దతిచ్చిన ఒక స్వతంత్ర ఎంపీ అండగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఆ రెండు కలుపుకుంటే బిల్లుకు మద్దతు తెలిపే వారి సంఖ్య 356కి చేరుతుంది. ఇంకా 3/4 వంతు సభ్యుల మద్దతు కూడగట్టడానికి ఇంకా నలుగురు ఎంపీలు అవసరం అవుతారు.

Also Read: ఆర్‌బీఐ కీలక అడుగు.. విదేశాల నుంచి 165 టన్నుల పసిడి రాక, దేశానికి మరింత బలం

హాజరయ్యే సభ్యుల సంఖ్యే కీలకం

మెుత్తం మీద రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి ఆ రోజు సభకు హాజరై ఓటు వేసే సభ్యుల సంఖ్య అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం కనీసం ముగ్గురు ఎంపీల హాజరుపై సందిగ్ధత నెలకొంది. జులైలో జరిగిన వర్షాకాల సమావేశాల్లో సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి ఈ ప్రత్యేక సమావేశాల్లో ఓటు వేయడానికి అనుమతి ఉంటుందో లేదో స్పష్టత లేదు. అలాగే కశ్మీర్ స్వతంత్ర ఎంపీ షేక్ రషీద్, పంజాబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్ జైలులో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ అగా రుహుల్లా ఇటీవల రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం ఒక్కరికే పరిమితమైంది. ఓటింగ్ రోజున మరికొందరు ఎంపీలు సభకు గైర్హాజరైనా, ఓటింగ్‌కు దూరంగా ఉన్నా మెజారిటీ మార్కు తగ్గి బిల్లు ఆమోదింపచేసుకోవడానికి ప్రభుత్వానికి మార్గం సుగమం కానుంది.

Also Read: కొలంబో స్కూల్ పిల్ల‌ల చేతిలో ఐపీఎల్ స్టార్లు చిత్తుగా ఓడిపోయారు..షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం

Tags

Related News

ఎయిర్ బేస్ టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. ఏటీఎస్ మెరుపు ఆపరేషన్.. జైషే టెర్రరిస్ట్ అరెస్ట్!

అన్నదమ్ముల ఘాతుకం.. భార్యలను చంపి అడవిలో పాతిపెట్టి ఆ తర్వాత, జార్ఖండ్‌లో తీవ్ర కలకలం

తెలంగాణ ఐఏఎస్ హత్య కేసు.. మళ్లీ జైలుకు బిహార్ మాజీ ఎంపీ.. అసలేం జరిగిందంటే?

ముదిరిన సోషల్ మీడియా వార్.. మెటాకు కాంగ్రెస్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!

అమితాబ్ ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు.. మెట్రో స్టేషన్లకూ హెచ్చరిక.. ముంబైలో హై అలర్ట్!

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ గుర్తు ఉండాల్సిందే!

ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో కరెన్సీ నోట్ల వర్షం.. చీపురుతో ఊడుస్తున్న దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×