E-Paper
Advertisement

గుజరాత్‌లో ఘోర విషాదం.. క్షణాల్లోనే కాలిబూడిదైన కారు.. ముగ్గురు సజీవ దహనం!

గుజరాత్‌లో ఘోర విషాదం.. క్షణాల్లోనే కాలిబూడిదైన కారు.. ముగ్గురు సజీవ దహనం!
Advertisement

Gujarat Accidents: గుజరాత్‌లో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. అతివేగం కారణంగా కారు రాయిని ఢీకొని మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఘటనలో సైనిక కుటుంబాలకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

జునాగఢ్ జిల్లాలోని కేషోద్-బలగం రహదారిపై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. అతివేగంగా ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రాయిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే అగ్నిగోళంలా మండిపోయింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ఇద్దరు మగవారు, ఒక మహిళ బయటకు రాలేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

Advertisement

మరోవైపు ఈ ప్రమాదం నుంచి కృష్ణబెన్ అనే మహిళ ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యం అందుతోందని పోలీసులు తెలిపారు. బాధితులంతా జునాగఢ్ నుండి మాధవపూర్ వైపు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కారు పూర్తిగా కాలిపోవడంతో మిగిలిన వారిని గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఎం.డీ చౌదరి వెల్లడించారు.

Also Read: ఫుట్‌పాత్‌పై బైకర్ల ఓవరాక్షన్.. చుక్కలు చూపించిన ముగ్గురు మహిళలు.. నెట్టింట ప్రశంసల జల్లు!

Advertisement

ఇదిలా ఉంటే గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్-ఖావ్డా జాతీయ రహదారిపై మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సైనిక కుటుంబాలకు చెందిన ఏడుగురు సభ్యులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జుకాగా.. మృతదేహాలు లోపలే ఇరుక్కుపోయి ఛిద్రమయ్యాయి. అతి కష్టం మీద వాటిని బయటకు తీయాల్సిన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

Also Read: జియో సంచలన ఆఫర్.. రోజుకు 2.5GB డేటాతో పాటు 12 నెలల Canva Pro ఉచితం.. ఎలా పొందాలంటే?

Tags

Related News

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఓవరాక్షన్.. చుక్కలు చూపించిన ముగ్గురు మహిళలు.. నెట్టింట ప్రశంసల జల్లు!

పోలీస్ వరుడి కట్నం కక్కుర్తి.. బ్రెజ్జా కారు లేదని పెళ్లి క్యాన్సిల్.. మండపం నుంచి యూటర్న్!

కాంగ్రెస్‌లో సిరాజ్ చిచ్చు.. సొంత పార్టీ నేతకే.. ఎంపీ ముంతాజ్ పటేల్ చురకలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురి దుర్మరణం

కెనడాలో దారుణం.. భారత సంతతి జంటపై కాల్పులు.. టార్గెట్ చేసి మరీ లేపేశారు!

అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది దుర్మరణం!

ముంబై పార్కులో యువజంటపై మైనర్ల దాడి.. 8 మంది అదుపులోకి, వీడియో వైరల్

Big Stories

Advertisement
×