E-Paper
Advertisement

పోలీస్ వరుడి కట్నం కక్కుర్తి.. బ్రెజ్జా కారు లేదని పెళ్లి క్యాన్సిల్.. మండపం నుంచి యూటర్న్!

పోలీస్ వరుడి కట్నం కక్కుర్తి.. బ్రెజ్జా కారు లేదని పెళ్లి క్యాన్సిల్.. మండపం నుంచి యూటర్న్!
Advertisement

Haryana Wedding: హర్యానాలోని సోనిపట్‌లో ఓ వివాహతంతు పెళ్లి పీటలపై అర్ధాంతరంగా ముగిసిపోయింది. తాను అడిగిన కారు ఇవ్వలేదన్న కారణంతో వరుడు పెళ్లిని నిరాకరించి కుటుంబ సభ్యులతో కలిసి మండపం నుంచి వెనుదిరగడం స్థానికంగా కలకలం రేపింది. నవంబర్ 20న సోనిపట్‌లోని మామ్‌చంద్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వరుడు కుల్దీప్.. రూ.13 లక్షల విలువైన బ్రెజ్జాకారు ఆశించగా.. అంతకుముందే వధువు తండ్రి సుభాష్ కుమార్ రూ. 9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేశారు. ఈ విషయంలోనే వివాదం తలెత్తి పెళ్లి రద్దయ్యే స్థితికి వెళ్లింది.

మరోవైపు వరుడు, అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి ఏర్పాట్ల కోసం తాను రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేశామని వధువు తండ్రి సుభాష్ తెలిపారు. ఆయన ఫిర్యాదు ప్రకారం.. సుమారు 6 నెలల క్రితం సుభాష్ కుమార్తె హీనా వివాహాన్ని కుల్దీప్‌తో నిశ్చయించారు. నవంబర్ 20న పెళ్లి ముహూర్తం ఖరారైంది. అయితే పెళ్లి ఖాయమైన దగ్గర నుంచే వరుడి తరఫు నుంచి కారు, బంగారు ఆభరణాల కోసం డిమాండ్లు మొదలయ్యాయని తండ్రి ఆరోపించారు.

Advertisement

వరుడి కోసం సుభాష్ అప్పటికే రూ. 9.5 లక్షల విలువైన కారును బుక్ చేశారు. కానీ పెళ్లికి సరిగ్గా ఒక్క రోజు ముందు మధ్యవర్తుల ద్వారా కుల్దీప్ ఆ కారు పట్ల అసంతృప్తిగా ఉన్నాడని తెలిసింది. మారుతి బ్రెజ్జా కావాలని కోరుతున్నాడని సుభాష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆందోళన చెందిన వధువు కుటుంబం పాత బుకింగ్‌ను రద్దు చేసుకుని.. బ్రెజ్జా కారు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే చేతిలో సమయం తక్కువగా ఉండటంతో అంత త్వరగా ఆ కారును సమకూర్చలేకపోయారు.

Advertisement

అయితే వరుడి డిమాండ్లు కేవలం కారుతోనే ఆగిపోలేదని సుభాష్ చెప్పారు. వరుడికి రెండు తులాల బంగారు గొలుసు, అతని తల్లికి నాలుగు తులాల బంగారు కమ్మలు, వెండి పట్టీలు ఇస్తానని తమ కుటుంబం అంగీకరించిందన్నారు. అంతేకాకుండా వరుడి అన్నయ్య, వదినలకు కూడా నగలు కావాలని అడగడంతో వాటికి కూడా ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను కూడా సిద్ధం చేశామని.. కేవలం ఫర్నిచర్ కోసమే దాదాపు రూ. 1.32 లక్షలు ఖర్చు అయినట్లు ఆయన వివరించారు.

Also Read: ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

అయితే పెళ్లి రోజున మామ్‌చంద్ వాటికలో సుమారు 1,200 మంది అతిథులకు భోజన ఏర్పాట్లతో సహా ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు వధువు తండ్రి తెలిపారు. కానీ, పెళ్లి ఊరేగింపుతో రావాల్సిన కుల్దీప్, తన తల్లితో కలిసి సాధారణ దుస్తుల్లో వచ్చి నేరుగా బ్రెజ్జా కారు కోసం వెతికాడని ఆరోపించారు. అయితే కారు కనిపించకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వధువు కుటుంబ సభ్యులను వరుడు దూషించాడని, హీనా సోదరుడు సాహిల్‌తో కూడా గొడవకు దిగాడని సుభాష్ తెలిపారు. పెళ్లి తంతు పూర్తి చేయాలని బంధువులు చేతులు జోడించి వేడుకున్నప్పటికీ.. కుల్దీప్, అతని తల్లి నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు.

Also Read: ఫోటోలు డిలీట్ చేసినా స్టోరేజ్ ఫుల్ చూపిస్తోందా?ఈ హిడెన్ ఫీచర్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Tags

Related News

కాంగ్రెస్‌లో సిరాజ్ చిచ్చు.. సొంత పార్టీ నేతకే.. ఎంపీ ముంతాజ్ పటేల్ చురకలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురి దుర్మరణం

కెనడాలో దారుణం.. భారత సంతతి జంటపై కాల్పులు.. టార్గెట్ చేసి మరీ లేపేశారు!

అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది దుర్మరణం!

ముంబై పార్కులో యువజంటపై మైనర్ల దాడి.. 8 మంది అదుపులోకి, వీడియో వైరల్

తమిళనాడు టు ఏపీ.. డేటా లీక్ కలకలం! 15 మంది ఎగ్జిట్ వెనుక అసలు కథేంటి?

కాటేసిన కల్తీ మద్యం.. 15 మంది మృతి, ఆసుపత్రిలో 180 మంది, మణిపూర్‌లో ఊహించని దారుణం

Big Stories

Advertisement
×