E-Paper
Advertisement

అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది దుర్మరణం!

అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది దుర్మరణం!
Advertisement

Rajasthan Road Accident: రాజస్థాన్‌లోని కోట-ఉదయ్‌పూర్ హైవేపై అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంభుపుర గ్రామానికి సమీపంలో వేగంగా వస్తున్న క్రూజర్ వాహనం.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. రాత్రి సుమారు 2:00 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా..

మహారాష్ట్రకు చెందిన బాధిత కుటుంబం.. 15 మంది సభ్యులతో కలిసి రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్‌జీ దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం ముగించుకుని తిరిగి తమ స్వస్థలానికి ప్రయాణమవుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే వాహనం అదుపుతప్పి లారీని ఢీకొట్టి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతుల వివరాలు ఇలా..

Advertisement

ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఉషా బాయి, సుశీల, కైలాష్, సాన్వి, సజ్జన్, అనిత, బాబూలాల్, జాహ్నవి, మాధవిగా గుర్తించారు. ఒకే కుటుంబంలో ఇంతమంది మరణించడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం

Advertisement

అంతకుముందు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సిటీ ఎస్పీ తేజస్విని గౌతమ్, పోలీసులు, సహాయక బృందాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. నుజ్జునుజ్జయిన వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి, గాయపడిన ఆరుగురిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. జిల్లా అడిషనల్ కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రిని సందర్శించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Also Read: అరకు రైల్వే మార్గం వెనుక ఆసక్తికర కథ.. మన కోసం కాదు, జపాన్ కోసం నిర్మించారా?

అడిషనల్ కలెక్టర్ ఏమన్నారంటే?

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు అదనపు జిల్లా కలెక్టర్ రాజేష్ జోషి ధ్రువీకరించారు. ఈ ఘటనను అత్యంత విషాదకరమైనదిగా అభివర్ణించిన ఆయన ఖాటూ శ్యామ్ దర్శనం తర్వాత వారంతా మహారాష్ట్రకు తిరిగి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారని.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా చూడటమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Also Read: పెద్ద బ్యాటరీతో విండ్సర్ EV ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఇక రేంజ్ మామూలుగా ఉండదండోయ్!

Tags

Related News

కెనడాలో దారుణం.. భారత సంతతి జంటపై కాల్పులు.. టార్గెట్ చేసి మరీ లేపేశారు!

ముంబై పార్కులో యువజంటపై మైనర్ల దాడి.. 8 మంది అదుపులోకి, వీడియో వైరల్

తమిళనాడు టు ఏపీ.. డేటా లీక్ కలకలం! 15 మంది ఎగ్జిట్ వెనుక అసలు కథేంటి?

కాటేసిన కల్తీ మద్యం.. 15 మంది మృతి, ఆసుపత్రిలో 180 మంది, మణిపూర్‌లో ఊహించని దారుణం

పాక్ మంత్రికి కేంద్రం షాక్.. తాజ్‌మహల్‌కు నో ఎంట్రీ.. షాంఘై సదస్సుకే పరిమితం!

భర్తతో శారీరక సాన్నిహిత్యానికి నిరాకరించడం, పిల్లలను దూరం చేయడం మానసిక కృూరత్వం: కోర్టు

కాంగ్రెస్ మిషన్- 2029.. పార్టీలో భారీగా ప్రక్షాళన, రాహుల్ ‘సామాజిక న్యాయం’ మార్క్

Big Stories

Advertisement
×