E-Paper
Advertisement

కెనడాలో దారుణం.. భారత సంతతి జంటపై కాల్పులు.. టార్గెట్ చేసి మరీ లేపేశారు!

కెనడాలో దారుణం.. భారత సంతతి జంటపై కాల్పులు.. టార్గెట్ చేసి మరీ లేపేశారు!
Advertisement

Indian-Origin Couple Murder: కెనడాలోని సర్రే నగరంలో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన యువతీ, యువుకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వాల్‌మార్ట్ స్టోర్ బయట ఈ కాల్పుల చోటుచేసుకోగా గగన్‌ప్రీత్ (గారీ) రేహల్ (23), సుఖ్‌జీత్ కౌర్ (24) అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిగా స్థానిక పోలీసులు భావిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

నవంబర్ 15 రాత్రి 10:38 గంటల ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలో తుపాకీ గాయాలతో పడి ఉన్న ఈ జంటను గుర్తించారు. అయితే స్థానికుల సమాచారంతో హుటాహుటీనా ఘటన స్థలికి చేరుకున్న అత్యవసర సిబ్బంది.. ఇద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించినట్లు సర్రే పోలీస్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే ఇద్దరూ మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. వీరిద్దరూ పక్కనే ఉన్న డెల్టా టౌన్‌షిప్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

కేసు దర్యాప్తులో కీలక మలుపులు

మరోవైపు ఈ కేసు దర్యాప్తును కెనడాలోని అతిపెద్ద హత్యల విచారణ విభాగమైన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (IHIT) చేపట్టింది. కాల్పులు జరిగిన వాల్‌మార్ట్ పార్కింగ్ స్థలంలో అద్దాలు పగిలిపోయిన స్థితిలో ఉన్న ఒక ఎరుపు రంగు మస్టాంగ్ కారును గమనించారు. రేహల్‌పై గతంలో ఆయుధాలకు సంబంధించిన నేరాల రికార్డులు ఉన్నాయని, కౌర్‌కు మాత్రం కెనడాలో పరిచయాలు చాలా పరిమితంగా ఉన్నాయని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.

సమీపంలో కారు దహనం కోణం..

Advertisement

అయితే ఆ జంటపై కాల్పులు జరిగిన సుమారు 13 నిమిషాల తర్వాత సమీపంలో ఒక కారు తగలబడినట్లు సమాచారం పోలీసులకు అందింది. ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని.. కాలిపోయిన కారు నిందితులదే అయి ఉండొచ్చని ఐహెచ్ఐటీ అధికారులు అంచనావేస్తున్నారు. ఈ హత్యలు వ్యూహాత్మకంగా జరిగాయని, వీటి వెనుక ఏదైనా ముఠ హస్తం ఉండొచ్చని ఐహెచ్ఐటీ తన ప్రకటనలో తెలిపింది. ఈ కాల్పుల ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని.. ఈ ఘటనకు సంబంధించి ఎవరివద్దైనా సమాచారం ఉంటే తమకు అదించాలని సూచించింది.

కారులో యువకుడి మృతదేహం

ఇదిలా ఉంటే.. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని లాంగ్లీ ప్రాంతంలో తగలబడుతున్న కారు లోపల 25 ఏళ్ల భారత యువకుడి మృతదేహం లభ్యమైంది. సర్రేలో నివసిస్తున్న తుషార్ శర్మగా పోలీసులు అతడిని గుర్తించారు. అక్టోబర్ 29 రాత్రి సుమారు 10:30 గంటల ప్రాంతంలో లాంగ్లీలోని రాల్‌లిన్సన్ క్రెసెంట్ ప్రాంతంలో కారు తగలబడుతోందని పోలీసులకు సమాచారం అందింది. మంటలను ఆర్పుతున్న సమయంలో కారు లోపల మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది.. వెంటనే హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: గులాబీ కొత్త వ్యూహం.. రంగంలోకి సర్వే టీమ్స్.. ప్రజా నాడి పట్టేందుకు కొత్త స్కెచ్!

వ్యక్తిగత కారణాలపై ఆరా

శర్మకు ఎలాంటి నేర చరిత్ర లేదని, కెనడాలో అతడికి పెద్దగా సామాజిక పరిచయాలు కూడా లేవని దర్యాప్తు అధికారులు తెలిపారు. మృతికి ముందు అతడి వ్యక్తిగత జీవితం, దినచర్య, అలవాట్ల గురించి తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు విదేశాల్లో ఉన్న బంధువులను కూడా సంప్రదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శర్మను కావాలనే లక్ష్యంగా చేసుకుని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు, వ్యక్తిగత కక్షలు లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Also Read: అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది దుర్మరణం!

Tags

Related News

అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది దుర్మరణం!

ముంబై పార్కులో యువజంటపై మైనర్ల దాడి.. 8 మంది అదుపులోకి, వీడియో వైరల్

తమిళనాడు టు ఏపీ.. డేటా లీక్ కలకలం! 15 మంది ఎగ్జిట్ వెనుక అసలు కథేంటి?

కాటేసిన కల్తీ మద్యం.. 15 మంది మృతి, ఆసుపత్రిలో 180 మంది, మణిపూర్‌లో ఊహించని దారుణం

పాక్ మంత్రికి కేంద్రం షాక్.. తాజ్‌మహల్‌కు నో ఎంట్రీ.. షాంఘై సదస్సుకే పరిమితం!

భర్తతో శారీరక సాన్నిహిత్యానికి నిరాకరించడం, పిల్లలను దూరం చేయడం మానసిక కృూరత్వం: కోర్టు

కాంగ్రెస్ మిషన్- 2029.. పార్టీలో భారీగా ప్రక్షాళన, రాహుల్ ‘సామాజిక న్యాయం’ మార్క్

Big Stories

Advertisement
×