E-Paper
Advertisement

తిన్న వెంటనే టీ తాగుతున్నారా?నిపుణులు చెప్పేది వింటే షాక్ అవుతారు!

తిన్న వెంటనే టీ తాగుతున్నారా?నిపుణులు చెప్పేది వింటే షాక్ అవుతారు!
Advertisement

Side effects of drinking tea: టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే వేడి వేడి టీ తాగితే రిలాక్సింగ్ గా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. కానీ ఈ అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని కొనసాగించడం వల్ల జీర్ణక్రియ, పోషకాల శోషణపై కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలోని ఐరన్ శరీరానికి సరిగ్గా అందకపోవడం అంతే కాకుండా గ్యాస్ లేదా అసిడిటీ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకీ తిన్న వెంటనే టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనికి సంబంధించి ఆరోగ్య నిపుణులు చెస్తున్న హెచ్చరికల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తిన్న వెంటనే టీ తాగడం వల్ల కలిగే సమస్యలు:

1.ఐరన్ శోషణ:

టీలో పాలీఫినాల్స్, టానిన్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి భోజనం ద్వారా లభించే నాన్ హీమ్ ఐరన్‌తో కలిసి జీర్ణ వ్యవస్థను బంధిస్తాయి. దీని వల్ల ఆహారంలోని ఐరన్‌ను శరీరం పూర్తి స్థాయిలో గ్రహించలేకపోతుంది. ఈ సమస్య ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఇదిలా ఉంటే.. ఐరన్ లోపం ఉండే వారు, రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడే వారు, గర్భిణీలు తిన్న వెంటనే టీ తాగడం వల్ల కూడా ఐరన్ లోపం మరింత ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

2.ఎసిడిటీ, జీర్ణ సమస్యలు:

Advertisement

ఇలా తిన్న వెంటనే వేడి వేడి టీ లేదా పాలు, చక్కెర కలిపిన పాలు తాగడం వల్ల కూడా కొందరిలో కడుపు ఉబ్బరం, అంతే కాకుండా గ్యాస్, అసిడిటీ, లేదా గుండెలో మంట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా ఎక్కువగా భోజనం చేసిన తర్వాత కూడా కెఫిన్ తీసుకుంటే కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫలితంగా ఇది ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియను కూడా నెమ్మదింపజేస్తుంది.

3.కెఫిన్ ప్రభావం:

రాత్రి భోజనం తర్వాత టీ తాగే అలవాటు..కూడా చాలా మందిలో ఉంటుంది. టీలో కెఫిన్ ఉండటం వల్ల రాత్రి పూట నిద్ర పట్టడంలో ఆలస్యం లేదా నిద్ర నాణ్యత తగ్గడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇదిలా ఉంటే ప్రతి ఒక్కరి శరీరంలో కెఫిన్ పనితీరు భిన్నంగా ఉంటుంది. కొంత మంది రాత్రి పూట కొంచెం టీ తాగినా కూడా అది నిద్రపై ఎక్కువ ప్రభావం ఉంటుంది.

Advertisement

Also Read: లెమన్ ఫిష్ రెసిపీ..తక్కువ మసాలాలతో అద్భుతమైన రుచి!

4. ఎంత సమయానికి టీ తాగాలి ?

భోజనం చేసిన తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి గంట వరకూ..గ్యాప్ ఇచ్చి టీ తాగడం మంచిది. ఇలా సమయం ఇవ్వడం వల్ల తిన్న ఆహారంలోని పోషకాలు, ముఖ్యంగా ఐరన్ శరీరం గ్రహించడానికి తగినంత సమయం కూడా లభిస్తుంది. అలాగే ఒక్కసారి ఎక్కువ టీ తాగకుండా పరిమితంగా తీసుకోవడం ముఖ్యం.ఇదిలా ఉంటే తక్కువ చెక్కర కలిపి టీ తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

భోజనం తర్వాత కడుపు నొప్పి, అసిడిటీ, వాంతులు, జీర్ణ సమస్యలు, లేదా ఐరన్ లోపం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related News

టాబ్లెట్ స్ట్రిప్ మీద ఎర్రటి గీత ఎందుకు ఉంటుంది? మందులు కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

మనసులో నిరాశ, బాధ, గందరగోళంగా ఉందా? ప్రతి సమస్యకు పరిష్కరం సూచించే భగవద్గీత అధ్యాయాలు ఇవే

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి మంచి డ్రెస్ కావాలా? అబ్బాయిలు, అమ్మాయిల కోసం స్టైలిష్ అవుట్‌ఫిట్స్ చూడండి

ఎక్కువ కష్టపడకుండా నడకతోనే వారంలో కిలో బరువు తగ్గించే సింపుల్ ఫార్ములా ఇదే!

ఖరీదైన క్లీనర్లతో పనిలేదు.. ఇంట్లో ఉండే ఈ ఒక్క లిక్విడ్ చాలు, బాత్రూమ్ కొత్తదానిలా మెరిసిపోతుంది!

ఫైబర్ పుష్కలంగా ఉండే స్పెషల్ ఉప్మా.. చలికాలంలో సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌

భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ పని చేస్తే సరి.. బంధం మరింత బలపడుతుంది

Big Stories

Advertisement
×