E-Paper
Advertisement

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఓవరాక్షన్.. చుక్కలు చూపించిన ముగ్గురు మహిళలు.. నెట్టింట ప్రశంసల జల్లు!

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఓవరాక్షన్.. చుక్కలు చూపించిన ముగ్గురు మహిళలు.. నెట్టింట ప్రశంసల జల్లు!
Advertisement

Viral Video: నడకదారి కోసం నిర్మించిన ఫుట్ పాత్ లు ఈ రోజుల్లో వాహనదారులకు షార్ కట్స్ గా మారుతున్నాయి. రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకునేందుకు కొందరు ద్విచక్ర వాహనదారులు.. ఫుట్ పాత్ లపై బండ్లు నడిపిస్తున్నారు. ఇలా నడకమార్గంలోకి దూసుకొచ్చిన బైకర్లకు ముగ్గురు మహిళలు తగిన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే?

ఓ ఫుట్‌పాత్‌పై ముగ్గురు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా.. వారి వెనుక పదుల సంభ్యలో బైకర్లు ఉన్న దృశ్యాలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ తప్పించుకోవడానికి ఫుట్‌పాత్ ఎక్కిన ఆ బైకర్లు.. దారి ఇవ్వాలంటూ పదేపదే హారన్ కొడుతున్న శబ్దం వీడియోలో వినిపించింది. అయినప్పటికీ.. ఆ ముగ్గురు మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పక్కకు తప్పుకోకుండా ఫుట్‌పాత్‌ దిగకుండా తమ దారిలో తాము ఏమి పట్టనట్లు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లారు. నడిచేవారికి మాత్రమే ఆ దారిలో హక్కుందని తమ చేతలతో చెప్పకనే చెప్పారు.

Advertisement

‘బైకర్లకు బాగా బుద్ధి చెప్పారు’

మహిళ చేసిన పనిపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. వారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ బైకర్లకు ముగ్గురు అమ్మాయిలు గట్టి బుద్ధి చెప్పారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే ప్రతీ ఒక్కరూ చేస్తే.. ఫుట్ పాత్ ప్రమాదాలను చాలా వరకూ అరికట్టవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు సైతం ఇలా ఫుట్ పాత్ లపై బైక్స్ నడిపే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ నెట్టింట వెల్లువెత్తుతున్నాయి.

ఒక్క ఘటనతో మార్పు వస్తుందా?

Advertisement

కాగా, రోడ్లపై ట్రాఫిక్ పెరిగినప్పుడల్లా బైక్స్ ఫుట్‌పాత్‌లపైకి ఎక్కడం, పాదాచారులను ఇబ్బంది పెట్టడం సర్వసాధారణమైపోయింది. తాజా ఘటనతో ఆ సమస్యపై మరోసారి చర్చకు వచ్చింది. మహిళల తీరును కొందరు అభినందిస్తుండగా ఇలాంటి వీడియోల వల్ల వాహనదారుల్లో మార్పు వస్తుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘ఇదేమీ వాళ్లకు పాఠం కాదు. సమయానికి గమ్యం చేరుకోవాలనే హడావిడీలో వాళ్లు ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తారు’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఇకనైనా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.

Also Read: ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

జైపూర్‌లోనూ ఇలాంటి ఘటనే

ఇలాంటి ఘటనే గతంలో జైపూర్‌లోనూ చోటుచేసుకుంది. అక్కడ ముగ్గురు యువకులు ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా వెనుక నుంచి వచ్చిన బైకర్లు హారన్లు మోగించారు. కానీ యువకులు పక్కకు తప్పుకోకుండా మామూలు వేగంతోనే నడిచారు. పక్కనే ఉన్న ఓ వాహనదారుడు ఈ దృశ్యాన్ని వీడియో తీస్తూ యువకులను మెచ్చుకోవడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.

Also Read: పోలీస్ వరుడి కట్నం కక్కుర్తి.. బ్రెజ్జా కారు లేదని పెళ్లి క్యాన్సిల్.. మండపం నుంచి యూటర్న్!

Tags

Related News

గుజరాత్‌లో ఘోర విషాదం.. క్షణాల్లోనే కాలిబూడిదైన కారు.. ముగ్గురు సజీవ దహనం!

పోలీస్ వరుడి కట్నం కక్కుర్తి.. బ్రెజ్జా కారు లేదని పెళ్లి క్యాన్సిల్.. మండపం నుంచి యూటర్న్!

కాంగ్రెస్‌లో సిరాజ్ చిచ్చు.. సొంత పార్టీ నేతకే.. ఎంపీ ముంతాజ్ పటేల్ చురకలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురి దుర్మరణం

కెనడాలో దారుణం.. భారత సంతతి జంటపై కాల్పులు.. టార్గెట్ చేసి మరీ లేపేశారు!

అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది దుర్మరణం!

ముంబై పార్కులో యువజంటపై మైనర్ల దాడి.. 8 మంది అదుపులోకి, వీడియో వైరల్

Big Stories

Advertisement
×