E-Paper
Advertisement

ముంబై పార్కులో యువజంటపై మైనర్ల దాడి.. 8 మంది అదుపులోకి, వీడియో వైరల్

ముంబై పార్కులో యువజంటపై మైనర్ల దాడి.. 8 మంది అదుపులోకి, వీడియో వైరల్
Advertisement

Mumbai Attack: పార్కులో ప్రశాంతంగా కాసేపు గడుపుదామని వెళ్లిన ఓ యువజంటకు చేదు అనుభవం ఎదురైంది. సరదాగా మాట్లాడుకుంటూ, ఫొటోలు దిగుతున్న సమయంలో కొందరు మైనర్లు అక్కడికి వచ్చి వారితో గొడవకు దిగారు. మాటలతో మొదలైన వివాదం చివరకు దాడి వరకు వెళ్లింది. యువకుడిపై దాడి చేయడమే కాకుండా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన యువతిని కూడా వదల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ముంబైలో కలకలం రేగింది.

ఫొటోలు దిగుతుండగా మొదలైన గొడవ

Advertisement

ముంబైలోని కుర్లా వెస్ట్ ప్రాంతంలో ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్‌లో ఈ ఘటన జరిగింది. ఓ యువతి, యువకుడు పార్కులో కూర్చుని ఫొటోలు దిగుతుండగా అక్కడికి కొందరు మైనర్లు వచ్చారు. వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో యువజంటకు ఆ మైనర్లకు మధ్య మాటామాటా పెరిగింది. చిన్నగా మొదలైన వాగ్వాదం కాస్తా తీవ్ర గొడవగా మారింది.

అడ్డుకోబోయిన యువతిపైనా దాడి

Advertisement

ఈ క్రమంలో ఆ మైనర్లు యువకుడిని చుట్టుముట్టి దాడి చేశారు. తనతో వచ్చిన యువకుడిపై దాడి జరుగుతుండటాన్ని చూసిన యువతి అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె పై కూడా దాడి చేశారు. అంతేకాదు, ఇద్దరినీ పార్కు నుంచి బయటకు వెళ్లగొట్టారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టుపక్కల వారు కూడా ఆందోళనకు గురయ్యారు.

8 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచే చర్యలు చేపట్టారు. అసలు గొడవ ఎందుకు మొదలైంది? యువజంట పై దాడి చేయడానికి గల కారణాలేంటి? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చే శ్రీవారి రూపం.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tags

Related News

తమిళనాడు టు ఏపీ.. డేటా లీక్ కలకలం! 15 మంది ఎగ్జిట్ వెనుక అసలు కథేంటి?

కాటేసిన కల్తీ మద్యం.. 15 మంది మృతి, ఆసుపత్రిలో 180 మంది, మణిపూర్‌లో ఊహించని దారుణం

పాక్ మంత్రికి కేంద్రం షాక్.. తాజ్‌మహల్‌కు నో ఎంట్రీ.. షాంఘై సదస్సుకే పరిమితం!

భర్తతో శారీరక సాన్నిహిత్యానికి నిరాకరించడం, పిల్లలను దూరం చేయడం మానసిక కృూరత్వం: కోర్టు

కాంగ్రెస్ మిషన్- 2029.. పార్టీలో భారీగా ప్రక్షాళన, రాహుల్ ‘సామాజిక న్యాయం’ మార్క్

లోయలో పడిన మినీ బస్సు, స్పాట్‌లో 24 మంది, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

అజిత్ ధోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. అసలేం జరిగింది? ఎవరీ గురుపత్వంత్ సింగ్ పన్నూ?

Big Stories

Advertisement
×