E-Paper
Advertisement

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై బిగ్ అప్డేట్.. కొత్త మంత్రులుగా వీరికి అవకాశం?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై బిగ్ అప్డేట్.. కొత్త మంత్రులుగా వీరికి అవకాశం?
Advertisement

Cabinet Expansion: స్వేచ్చ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి మంత్రి వర్గం విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ ఖాళీల భర్తీపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ ముఖ్య నాయకులు కోరుతున్నారు. విస్తరణ ఆలస్యం కావడం వల్ల పార్టీలో అంతర్గత అసంతృప్తులు పెరుగుతున్నాయని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పలువురు సీనియర్ నేతలు, ఆశావహులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు.మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 15 మంది మాత్రమే(కొండా సురేఖ స్థానంతో కలిపి) ఉన్నారు. మిగిలిన 3 స్థానాలను భర్తీ చేయాలని పార్టీ ముఖ్య నాయకుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఖాళీల భర్తీలో జాప్యం జరుగుతుండటంతో, ఆశావహుల మధ్య పోటీ పెరిగి పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని వారు భావిస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిందే..

పార్టీలో చేరిన సమయంలో అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని వారుటీపీసీసీని కోరుతున్నారు.ఇప్పటికే పలుమార్లు సీఎంపై ప్రత్యక్షంగానే విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డికి అదృష్టం వరిస్తుందా? లేదా? అనేది త్వరలోనే తేలిపోనున్నది.ఇక ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, డిసెంబర్ 7వ తేదీ లోపు మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను పూర్తి చేయాలని పలువురు నేతలు టీపీసీసీ నాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Also read: ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

మంత్రుల శాఖల్లో మార్పులు..

ఇక కేవలం కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేయాలని మరికొంత మంది నేతలు సూచిస్తున్నారు. ఒకే మంత్రి వద్ద కీలకమైన పలు శాఖలు ఉండటం వల్ల పాలనాపరమైన భారం పెరుగుతోందని, శాఖల షప్లీంగ్ ద్వారా పాలనలో మరింత వేగం పెంచవచ్చని ఈ వర్గం వాదిస్తోంది. మరోవైపు, ప్రస్తుత మంత్రుల పనితీరును సమీక్షించిన తర్వాతే శాఖల మార్పుపై అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీకి చెందిన మరికొందరు నేతలు పేర్కొంటున్నారు.

సామాజిక, ప్రాంతీయ సమీకరణాల సవాలు..

Advertisement

మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతను పాటించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి కీలకంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో, ఆయా జిల్లాల నేతలు తమకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. అదే సమయంలో రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మధ్య సమతూకం పాటించాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఏఐసీసీ నాయకత్వం కూడా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త ఏఐసీసీ ఇన్ చార్జ్ ఆధ్​వర్యంలో మంత్రి వర్గ విస్తరణ స్పీడప్ అవుతుందని లీడర్లు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.

Also read: పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయెుచ్చు: పవన్ కళ్యాణ్

Tags

Related News

రూ.40.96 కోట్ల వరి స్కామ్.. రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.30 లక్షల నగదు సీజ్!

నమ్మిన సంస్థకే నామంపెట్టిన అడ్మిన్ ఎగ్జిక్యూటివ్.. రూ.4.19 కోట్లు స్వాహా!

‘కూతుళ్లు వద్దు.. కొడుకు కావాలి’.. భార్యకు ఫోన్ మెసేజ్‌తో తలాక్ చెప్పిన భర్త!

వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ, నలుగురు మృతి

రాజకీయాలకు హైడ్రా అతీతం.. కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు.. బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్‌లో రంగనాథ్ వార్నింగ్!

గులాబీ కొత్త వ్యూహం.. రంగంలోకి సర్వే టీమ్స్.. ప్రజా నాడి పట్టేందుకు నయా స్కెచ్!

గాంధీభవన్‌లో హైటెన్షన్.. నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్ కీలక భేటి.. బహిరంగ వ్యాఖ్యల నేతలకు చెక్ పడేనా?

Big Stories

Advertisement
×