Guwahati Nightclub: అసోం గౌహతిలోని ఖానాపారా ప్రాంతంలో గల ప్రముఖ నైట్‌క్లబ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి దాటాక ‘లోకల్స్ కేఫ్ అండ్ లాంజ్’ (Locals cafe and lounge)లో ఒక మహిళతో కొందరు దారుణంగా ప్రవర్తించారు . ఆమె దుస్తులు ఊడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నైట్‌క్లబ్‌కు చెందిన బౌన్సర్లు కూడా భాగస్వాములయ్యారని ప్రత్యక్షసాక్షులు ఆరోపిస్తున్నారు.
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో దుస్తులు లేకుండా నేలపై పడి ఉన్న మహిళను ఇద్దరు కాలితో తన్నుతుండగా.. పక్కనే కొందరు అడ్డుకోకుండా చూస్తూ నిలబడి ఉన్నారు. మరొక వీడియోలో బాధిత మహిళను మరో మహిళ లేపేందుకు ప్రయత్నిస్తుండం చూడవచ్చు. అయితే దాడికి గురైన మహిళ ఎవరు? ఆమె వివరాలు ఏంటి? అన్నది తెలియరాలేదు.
A disturbing incident has reportedly taken place at ‘The Locals’ disco club in Khanapara, Guwahati, where a young woman was allegedly assaulted by bouncers. According to reports, she was dragged and stripped while being brought down from the fourth floor, and a bouncer allegedly… pic.twitter.com/DmiP8QEjkP
— The Sentinel (@Sentinel_Assam) October 2, 2026
స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. క్లబ్‌లో ముందుగా ఆమెను నేలపైకి తోసేసి, దుస్తులు ఊడదీసి దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో క్లబ్‌లోని లేడీ బౌన్సర్లతో పాటు మగ బౌన్సర్లు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. నైట్‌క్లబ్ నాలుగో అంతస్తులో ప్రారంభమైన ఈ దాడి.. కింద పార్కింగ్ ఏరియా వరకు కొనసాగినట్లు పలువురు చెబుతున్నారు. అసలు ఈ గొడవకు గల కారణాలు ఏంటన్నది మాత్రం స్పష్టత రాలేదు.
Also Read: ‘విమానమే నా బిడ్డ ప్రపంచం.. భార్య కూడా అదే’.. కెప్టెన్ స్మిత్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునే సమయానికి నైట్‌క్లబ్‌ను మూసివేసి లైట్లు ఆర్పేశారు. యజమాన్యం కానీ, క్లబ్ సిబ్బంది కానీ ఎవరూ బయటకు వచ్చి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ అవుతున్న దృశ్యాలు ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: జైలులో ఉన్న ఖైదీకి ఓ ఒంటరి తల్లి లేఖలు… కట్ చేస్తే మతిపోగొట్టే ట్విస్ట్… ఈ ఎమోషనల్ మూవీ తెలుగులోనే