E-Paper
Advertisement

మియాపూర్ అపార్ట్‌మెంట్‌లో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి!

మియాపూర్ అపార్ట్‌మెంట్‌లో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి!
Advertisement

Young Doctor Death: హఫీజ్‌పేటలోని ఓ ప్రైవేట్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డికి చెందిన ఈమె, మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఇటీవల వరంగల్‌లో పీడియాట్రిషన్‌లో పీజీ పూర్తి చేశారు.

అసలేం జరిగిందంటే?

Advertisement

మూడు రోజుల క్రితం ఈ యువ డాక్టర్ తన స్నేహితుడితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ పేట ఆదిత్య నగర్‌లో ఉన్న ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో వీరిద్దరూ గది అద్దెకు తీసుకుని బస చేశారు.

పోలీసుల వేగవంతమైన స్పందన

Advertisement

గత కొద్ది రోజులుగా కుమార్తె ఫోన్ కలవకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు శుక్రవారం మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆదిత్య నగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా, ఆమె అప్పటికే గదిలో మృతి చెంది పడి ఉంది.

పరారీలో స్నేహితుడు.. విచారణ వేగం

ఆమెతో పాటు వచ్చిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని సీఐ జయరాం తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఎవరు? అక్కడ ఏం జరిగింది? అనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: విశాఖ బీచ్‌లో విషాదం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు, నైట్ విజన్ కెమెరాలతో గాలింపు..

Tags

Related News

కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. కాంగ్రెస్‌ను ఏకిపారేసిన కేటీఆర్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్!

కేసీఆర్‌ని తిట్టడం కాదు.. పాలనసై దృష్టి పెట్టు రేవంత్!- చింత ప్రభాకర్

దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంపై దాడి.. నిందితుడు అదుపులోకి!

కొడంగల్‌లో కాదు.. ధైర్యముంటే ముందు సిరిసిల్లలో గెలువు! కేటీఆర్‌కు ఐలయ్య ఓపెన్ ఛాలెంజ్

అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అయితే.. చిన్న కొడుకు కేటీఆర్: అద్దంకి దయాకర్

తీర్పు వచ్చేవరకూ ఆగాల్సిందే.. ఖైరతాబాద్ ఉపఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం!

అబద్ధాలు నేర్చుకోవాలంటే కేటీఆర్ దగ్గర చేరాల్సిందే! గజ్జెల కాంతం

Big Stories

Advertisement
×