Emotional Romantic Drama: ఓ ఒంటరి తల్లి… జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి… వీళ్లిద్దరి మధ్య మొదలైనది కేవలం లేఖల ప్రయాణమే. కానీ ఆ లేఖలు క్రమంగా ఇద్దరి జీవితాల్లో ఊహించని మార్పుకు కారణమవుతాయి. బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఓ ఖైదీతో ఓ తల్లి ఎందుకు ఇంత దగ్గరవుతుంది ? వాళ్ల మధ్య ఏర్పడిన అనుబంధం చివరికి ప్రేమగా మారుతుందా ? లేక దాని వెనుక మరింత లోతైన కథ ఉందా ? ఇలాంటి ఇంట్రస్టింగ్, ఎమోషనల్ స్టోరీతో సాగే సినిమానే ‘డూయింగ్ లైఫ్’ (Doing Life). తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను తెలుగులో ఎక్కడ చూడవచ్చు అంటే ?
ఈ కథలో ఒక ఒంటరి తల్లి పిల్లల బాధ్యతలను సింగిల్ గానే మోస్తుంది. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, పిల్లల కోసం మాత్రం బలంగా ఉండే ప్రయత్నం చేస్తుంటుంది. ఇదే సమయంలో ఆమెకు జైలులో ఉన్న ఓ ఖైదీతో పరిచయం ఏర్పడుతుంది. అతడి గతం, అతడు చేసిన తప్పు, అతడి జీవితంలో జరిగిన పరిణామాలు ఆమెకు ఆసక్తిని కలిగిస్తాయి. మాట్లాడటానికి అవకాశం లేని పరిస్థితిలో వాళ్లిద్దరి మధ్య లేఖల ప్రయాణం మొదలవుతుంది.
మొదట సాధారణంగా మొదలైన ఈ లేఖలు క్రమంగా వ్యక్తిగత విషయాల వరకు వెళ్తాయి. జైలులో ఉన్న వ్యక్తికి బయట ప్రపంచంతో సంబంధం దాదాపుగా తెగిపోయినట్టే ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరో తన మాట వింటున్నారనే భావన అతడిలో కొత్త ఆశను కలిగిస్తుంది. అదే సమయంలో ఆ తల్లికి కూడా ఈ లేఖలు ఓ కొత్త అనుభూతిని ఇస్తాయి. తన సమస్యలను, తన భయాలను, తన గతాన్ని ఎవరికైనా చెప్పగలగడం ఆమె జీవితంలో మార్పు తీసుకొస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రత్యక్షంగా చూడకుండానే తమ జీవితాల్లోని బాధలను పంచుకుంటారు.
జైలులో ఉన్న వ్యక్తి తన గతాన్ని మార్చుకోలేకపోయినా, భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెడతాడు. అతడిలో వచ్చిన మార్పు లేఖల ద్వారా బయటపడుతుంది. మరోవైపు ఆ తల్లి కూడా తన జీవితాన్ని కొత్త కోణంలో చూడటం మొదలుపెడుతుంది. కానీ ఈ అనుబంధం అంత సులభంగా సాగదు. గతంలో జరిగిన తప్పులు, జైలు జీవితం, బయట ఉన్న సామాజిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు అన్నీ వీళ్లిద్దరి మధ్య గోడలుగా నిలుస్తాయి. అయినా లేఖలు మాత్రం ఆ గోడలను నెమ్మదిగా దాటుతూనే ఉంటాయి.
అసలు ఆ ఖైదీ జీవితంలో ఏం జరిగింది ? అతడిని జైలుకు పంపించిన గతం ఏంటి ? ఆ తల్లి ఎందుకు అతడికి ఇంత దగ్గరవుతుంది ? లేఖల ద్వారా ఏర్పడిన ఈ బంధం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంటుంది ? ఇద్దరి జీవితాలకు కొత్త ఆరంభం దొరుకుతుందా ? అసలు చివర్లో బయటపడే ఆ నిజం ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
‘డూయింగ్ లైఫ్’ 2026లో వచ్చిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. నయోమీ బేకర్ (Naomi Baker), జే రీవ్స్ (Jay Reeves), టాంబెర్లా పెర్రీ (Tamberla Perry) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్షీషుతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.