BigTV English

Heat Waves: రేపే రెండో దశ ఎన్నికల పోలింగ్‌.. ఓటర్లకు ఐఎండీ కీలక హెచ్చరికలు..!

Heat Waves: రేపే రెండో దశ ఎన్నికల పోలింగ్‌.. ఓటర్లకు ఐఎండీ కీలక హెచ్చరికలు..!

Second Phase Lok Sabha Elections 2024 : దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసి.. పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈసీ పోలింగ్ కు సిద్ధమవు వేల.. భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.


శుక్రవారం దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు జరగనుండగా.. ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల రోజున దేశవ్యాప్తంగా ఎండలు భారీగా ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్, జార్ఖండ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల ఐదు రోజులు వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బిహార్, కర్ణాటక రాష్ట్రాలకు ఆరెండ్ అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది.


రెండో విడత ఎన్నికలు దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ స్థానాల్లో జరగనున్నాయి. దీంతో దేశంలోని లక్షలాది మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కేరళలోని 20 లోక్ సభ స్థానాలు, కర్ణాటకలో 14, రాజస్థాన్ లో 13, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో 8, బిహార్, అస్సాంలో 5, ఛత్తీస్ గఢ్, పశ్చిమబెంగాల్ లో మూడు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. వీటితో పాటుగా త్రిపుర, జమ్ముకశ్మీర్ లో ఒక్కో స్థానంకు పోలింగ్ జరగనుంది. మణిపూర్ లో కూడా రెండో దశ పోలింగ్ జరగబోతోంది.

Also Read: ఎన్నికల బరిలో మాజీ సీఎం సతీమణి.. తోటి కోడలు వ్యతిరేకించడంతో..

ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఓటు వేయడానికి వీలైనంత త్వరగా వెళ్లి వచ్చేయడం మంచిదని వైద్యులు చూసిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు ఉదయానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. లేదంటే ఎండ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయని సూచించారు.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×