BigTV English

Hemant Soren: ఝార్కండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం..

Hemant Soren: ఝార్కండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం..

Hemant Soren Takes Oath As Jharkhand CM: ఝార్కండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ సోరోన్ మూడోసారి ఝార్కండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఈ నెల ఏడవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వినిపించినా.. ఆయన ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాక్రృష్ణన్ హేమంత్ సోరెన్‌తో ప్రమాణం చేయించారు.


ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, ఆర్జేడీ మంత్రి సత్యానంద్ భోక్తా, సీపీఐ (ML) ఎమ్మల్యే వినోద్ సింగ్ హాజరయ్యారు. వీరితో పాటు ఝార్కండ్ మాజీ ముఖ్యమంత్రి, హేమంత్ సోరెన్ తండ్రి శిబూ సోరెన్ కూడా హాజరయ్యారు.

భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత నెల 27న సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది రాంచీ హైకోర్టు. ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో అతని స్థానంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించారు. కాగా బుధవారం(జులై 3)న చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బలపరీక్ష జులై 8న ఏర్పాటు చేసిన శాసనసభ ప్రత్యేక సమావేశంలో జరుగుతుంది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×