Attack On Temples: జమ్మూలో శంభూ ఆలయాన్ని టార్గెట్ చేశారు పాక్ రేంజర్లు. P.O.J.K నుంచి ఆలయం లక్ష్యంగా కాల్పులు జరిపారు. పాక్ దాడుల్లో ఆలయం స్వల్పంగా దెబ్బతింది. ఆలయ ప్రాకారం స్వల్పంగా ధ్వంసమైంది. గత 15 రోజులుగా జమ్మూ లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ప్రజలు, ఆలయాలు, ప్రార్ధనా మందిరాలను సైతం టార్గెట్ చేస్తున్నారు.
దుష్టులకు ఆశ్రయిమిస్తూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్..భారత్‌పై దుస్సాహసానికి ప్రయత్నించి విఫలమైంది. నిన్న భారత్‌లోని నాలుగు రాష్ట్రాల్లో 36 నగరాలపైకి ఏకంగా 300 నుంచి 400 డ్రోన్లతో పాకిస్థాన్ దాడులకు తెగబడినట్లు భారత సైన్యం తెలిపింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 210 పది నిమిషాలు అంటే.. మూడున్నర గంటల పాటు.. ఏకధాటిగాదాడులకు తెగబడినట్లు వెల్లడించింది. గురువారం రాత్రి పాకిస్థాన్ వందల సంఖ్యలో క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మనపైకి ప్రయోగించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లపైకి డ్రోన్లను వదిలినట్లు చెప్పారు.
కాగా.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. టెర్రరిస్టులకు రక్షణ కల్పిస్తూ.. భారత్‌లో అశాంతిని రాజేస్తున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్తోంది భారత్. త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇవ్వడంతో.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బలగాలు కదనరంగంలోకి దూకాయి. సమన్వయంతో చేస్తున్న దాడులకు పాక్ పాలకులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
భారత్ వైపు చూడాలంటేనే.. భారత్ పేరు పలకాలంటేనే భయపడిపోయేలా పాకిస్తాన్‌పై ఎదురుదాడి చేసింది మనదేశం. అలాగని మనం గీసుకున్న లక్ష్మణ రేఖను దాటలేదు. తనకు తాను భారత్ ఏ దేశంపైనా దాడి చేయదు. ఇది మన విధానం. ఇప్పుడు కూడా అంతే. పాక్ దాడి చేసిన తర్వాతనే.. రైట్ టు రెస్పాన్స్ విధానంలో కౌంటర్ ఎటాక్‌కు దిగింది. ఆ ఎదురుదాడి ఎలా ఉంటుందో పాకిస్తాన్ పాలకులు, సైన్యం కనీసం ఊహించి ఉండరు.
ఇది యుద్ధం కాని యుద్ధం. వన్‌సైడ్ జరుగుతున్న వార్. పాకిస్తాన్ ఎప్పట్లాగే దొంగదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించింది. ఆల్ ఆఫ్ సడెన్.. జమ్మూపై డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. పాపి ఎత్తుగడలను ఓ కంట కనిపెట్టిన భారత్ బలగాలు.. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. పాక్ ప్రయోగించిన ఏ ఒక్క ఆయుధం.. టార్గెట్‌ను చేరుకోకుండా గాల్లోనే నిర్వీర్యం చేసేశాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్. ఒకవైపు పాకిస్తాన్ ఎటాక్స్‌ను కాచుకుంటూనే.. మరోవైపు కౌంటర్ ఎటాక్స్ మొదలుపెట్టింది భారత్. ఈసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాక్ వినాశనానికి ఆ రకంగా నాంది పడినట్టయింది.
Also Read: పాకిస్తాన్‌కు మద్దతుగా పోస్ట్‌లు.. విద్యార్థిపై కేసు నమోదు
పాకిస్తాన్‌లోని, పాక్ ఆక్రమిత జమ్ముకాశ్మీర్‌లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయడానికి భారత్‌కు 25 నిమిషాలు పట్టింది. కానీ, లాహోర్ ఎయిర్ డిఫెన్స్‌ను ధ్వంసం చేయడానికి కేవలం రెండున్నర నిమిషాలే పట్టిందని చెప్తున్నారు. జమ్ముపై దొంగదాడికి ప్రయత్నించిన పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు దూసుకెళ్లిన భారత్ బలగాల ధాటికి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ పనికిరాకుండా పోయింది. బాంబుల వర్షానికి పాపి సైన్యం చెల్లాచెదురైంది.