BigTV English

India Pakistan War: పాకిస్తాన్‌కు మద్దతుగా పోస్ట్‌లు.. విద్యార్థిపై కేసు నమోదు

India Pakistan War: పాకిస్తాన్‌కు మద్దతుగా పోస్ట్‌లు.. విద్యార్థిపై కేసు నమోదు

India Pakistan War: కశ్మీర్‌లో అశాంతి సృష్టించేందుకు.. పహల్గామ్‌లో పాక్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు.. పాక్‌కు కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ని కూడా గ్లోబ్ మొత్తం గమనిస్తోంది. 9 ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడి చేశాక.. పాక్ వీక్ అయింది. పైగా.. ప్రపంచ దేశాల మద్దతు కూడా మనకే ఉంది. ఉగ్రవాదం విషయంలో దేశంలో ప్రభుత్వం కూడా ధృడంగా ఉంది.


వీటన్నింటికి మించి భారత ప్రజల సపోర్ట్ బలంగా ఉంది. సరిహద్దుల్లో భారత దళాలు మాత్రమే కాదు.. ఇండియా మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. ఉగ్రవాదుల్ని ఏరిపారేయ్యాలి.. ఉగ్రవాదాన్ని గోతి తీసి పాతెయ్యాలనే మూడ్‌లో ఉంది దేశం మొత్తం. అందువల్ల.. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇంతకంటే మంచి టైమ్ లేదనే చర్చ సాగుతోంది. కొడితే.. ఇప్పుడే బలంగా కొట్టేయాలంటున్నారు. ఈసారి కొడితే.. టెర్రరిజం మళ్లీ లేవకూడదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలందరూ.. భారత సైన్యం వెన్నంట ఉంటున్నారు. అయితే కొందరు దురుద్దేశపూర్వకంగా ఇండియాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్‌లో కూడా అలాంటి పోస్ట్ పెట్టడంతో హాట్ టాపిక్‌గా మారింది.

ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఆర్మీ ఉగ్రమూకలను మట్టుపెట్టిన తరుణంలో.. ఓ విద్యార్ధిని సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది. అంతేకాదు తమ కాలేజీ వాట్సాప్ గ్రూపులో పాక్ కి ఇండియాకు వ్యతిరేకంగా “పాకిస్తాన్ జిందాబాద్” అని పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా ‘పాకిస్తాన్ వాళ్లు నా అన్నదమ్ములు.. నా అక్కాచెల్లెలు. వారికి అల్లా ఎప్పుడు తోడుగా ఉం
టారని పేర్కొంది. దీంతో ఆ కాలేజీ గ్రూపులోని మిగతా విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు.


ఈ విషయాన్ని తెలుసుకున్న BJYM VHP నాయకులు.. చంపాపేటలో యువతి చదువుతున్న కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. కళాశాలలో యువతి అడ్మిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ విద్యార్ధినిపై ఐఎస్ సదన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యం హామీ ఇవ్వడంతో.. హిందూ సంఘాల ప్రతినిధులు శాంతించారు. కాగా కొన్ని కొన్ని ప్రదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదరవుతున్నాయి. హైదారాబాద్‌లో చాలామంది పాకిస్తాన్ దేశస్తులు ఉన్నారని, వారిని దురుద్దేశపూర్వంగా రెచ్చగొట్టేలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Also Read: పాక్‌లో అంతర్యుద్ధం? సైన్యం తిరుగుబాటు? పాకిస్తాన్ షట్టర్ క్లోజ్

ఇంకా మన దేశం నుంచి పాకిస్తానీయులు వెళ్లలేదని.. తక్షణమే వారిని గుర్తించి పపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు దేశం కోసం సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే.. మరోవైపు మన దేశంలో ఉంటూ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×