BigTV English

Budget 2024 : కొత్త బడ్జెట్‌లో రానున్నవి ఇవేనా?

Budget 2024 : కొత్త బడ్జెట్‌లో రానున్నవి ఇవేనా?
national news today india

Budget news 2024 (national news today India) :


మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్టెట్‌లో కొన్ని ప్రధానమైన పథకాలకు నిధుల కేటాయింపు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు రానున్న ఈ బడ్జెట్‌లో రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను సంతోష పెట్టే నిర్ణయాలుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.


2047 నాటికి మనదేశం వేగంగా ఆర్థిక ప్రగతిని సాధించేదిశగా ప్రణాళికలు రచిస్తున్న కేంద్రం.. ఈసారి ఇన్‌ఫ్రా, మూలధన వ్యయం పెంపు అంశాలకు ఈసారి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వొచ్చనేది ఓ అంచనా.

అలాగే.. 52 శాతం ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష రీతిలో ఉపాధి కల్పిస్తున్న రైతాంగానికి ఊరట కలిగించేలా ఈసారి నిర్ణయాలుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ యోజనం పథకం కింద ఏటా రైతులకు ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని ఈసారి బడ్జెట్‌లో రూ.9 వేలు చేసే అవకాశముంది.

దేశ ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్ష ఆరోగ్య బీమా కవరేజిని రూ.8 లక్షలకు పెంచే ఛాన్స్ కూడా ఉందని అంచానా.

గ్రామీణ ప్రాంతాల్లో సూర్యోదయ యోజన కింద కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయటం, అలాగే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించే అవకాశాన్నీ కేంద్ర పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

ఈసారి బడ్జెట్‌ను రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా బడ్జెట్ రూపొందించారని తెలుస్తోంది. అలాగే.. ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలను సంతృప్తి పరచే పథకాల ప్రకటన కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×