E-Paper
Advertisement

టాటాసుమోపై విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి, వీడియో వైరల్!

టాటాసుమోపై విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి, వీడియో వైరల్!
Advertisement

Himachal Landslide: హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి పగబట్టిన వేళ ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. చంబా జిల్లా పరిధిలోని ఉదయ్‌పూర్-పాంగి రహదారిపై ప్రయాణిస్తున్న ఒక టాటా సుమో వాహనంపై సడన్‌గా కొండచరియలు విరిగిపడ్డాయి. కనురెప్పపాటులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మాత్రం అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు.

కళ్లు చెమర్చేలా దడ పుట్టిస్తున్న లైవ్ వీడియో

Advertisement

ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. కొండ పైభాగం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, మట్టి ఒక్కసారిగా ప్రయాణికుల వాహనాన్ని కమ్మేస్తున్న దృశ్యాలు నెటిజన్లను వణికించేలా ఉన్నాయి. అంతా చూస్తుండగానే ఆ వాహనం కొండచరియల కింద నలిగిపోవడం అత్యంత భయాందోళనకు గురిచేస్తోంది.

Also Read: సీఎంఆర్ కథ కంచికేనా.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న రైస్ మిల్లర్లు!

Advertisement

రహదారులపై రాకపోకలు బంద్..

ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, మార్గమంతా మట్టి, రాళ్లతో నిండిపోవడంతో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది. కొండచరియల ధాటికి వాహనం నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడం తీవ్ర శ్రమతో కూడుకున్న పనిగా మారింది. వర్షాల కారణంగా ఈ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు.

Related News

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

ఎస్‌బిఐ స్పెషల్ ఆఫీసర్ జాబ్స్.. వార్షిక వేతం రూ.97 లక్షలు

Big Stories

Advertisement
×