BigTV English

Application for Free Electricity: పీఎం సూర్య ఘర్‌ పథకంతో ఉచిత విద్యుత్‌.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ దరఖాస్తు ప్రక్రియ ఇలా..!

Application for Free Electricity: పీఎం సూర్య ఘర్‌ పథకంతో ఉచిత విద్యుత్‌.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ దరఖాస్తు ప్రక్రియ ఇలా..!

Application for free electricity Scheme: సౌర విద్యుత్‌ వినియోగాన్ని విస్తరించెందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన ’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ లక్ష్యంతో సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించే అవకాశం ఉంది. ఇందుకోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం అప్లై చేసుకోవాలి. ఈ ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం ఏలా అప్లై చేసుకోవాలో ఆ వివరాలను వెబ్‌సైట్‌లో వివరించారు.


దరఖాస్తు ప్రక్రియ వివరాలు..

ఇందులో ముందుగా ఈ పోర్టల్లో మీ పేరును రిజిస్టర్ చేసుకోవడం కోసం ముందుగా మీ రాష్ర్టంతో పాటు విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. తరువాత దానికి సంబంధించిన మొబైల్‌ నంబరు, కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీని అందులో ఎంటర్ చేయాలి. పోర్టల్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.. వాటి ప్రకారమే మీరు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి.


ఆ తర్వాత ముందుగా మీరు నమోదు చేసిన కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి. లాగిన్ తరువాల అందులో మీరు ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వివరాలు సరిగ్గ ఉంటే మీ దరఖాస్తును వెబ్‌సైట్‌ అనుమతిస్తుంది. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లో మీరు నమోదు చేసిన విక్రేతల నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత. ఆ ప్లాంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్‌లో ఎంటర్ చేసి.. నెట్ మీటర్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెట్ మీటర్ దరఖాస్తును డిస్కమ్‌ అధికారులు తనిఖీలు చేస్తారు. ఆ తరువాత పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌‌ను జారీ చేస్తారు. అనంతరం మీ బ్యాంకు ఖాతా వివరాలు, క్యాన్సిల్డ్‌ చెక్‌ పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తైన 30 రోజు గడువులోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

Tags

Related News

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×