Finger found inside Ice cream: రకరకాల పేర్లతో ఐస్‌క్రీమ్‌లు వినియోగదారులను ఊరిస్తాయి. రేటు కూడా అదే రేంజ్‌లో ఉంటోంది. ఎండలో బయట తిరిగినవారు ఇంటికొచ్చి ఐస్‌క్రీమ్ తిని కాస్త రిలాక్స్ అవుతారు. ఫింగర్ ఐస్‌క్రీమ్ ఎప్పుడైనా విన్నారా?
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ డాక్టర్‌కి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వడం.. గంటల వ్యవధిలో రావడం జరిగిపోయింది. సరిగ్గా తింటున్న సమయంలో మనిషి ఫింగర్ అందులో కనిపించింది. వెంటనే షాకవ్వడం ఆయన వంతైంది. ఇంకా లోతుల్లోకి వెళ్తే..
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉంటున్నారు డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్. ఈయన ఐస్‌క్రీమ్ ప్రియుడు. వాతావరణం కాస్త హాట్‌గా ఉండడంతో తినాలనిపించింది. ఏ మాత్రం బయటకు వెళ్లకుండా జెప్టో యావ్ ద్వారా బటర్ స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేశారు. గంటలోపే ఇంటికి వచ్చేసింది. ఓపెన్ చేసి హ్యాపీగా ఆలోచిస్తూ తినడం మొదలుపెట్టాడు.
అంతలోనే గట్టిగా ఉన్నది ఒకటి అతని నోటికి తగిలింది. చూసేసరికి మనిషి వేలు కనిపించింది. కాసేపు వరకు ఆయనకు నోటి మాట రాలేదు… షాకైయ్యాడు. ఆ ఫింగర్ దాదాపు రెండు సెంటీ మీటర్లు పొడవు ఉంది. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఓర్లెమ్ ఆందోళన చెందాడు. ఈ ఘటనపై మలాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు డాక్టర్ ఇంటికి వెళ్లి ఐస్‌క్రీమ్‌లో పడిన వేలు ముక్కను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ALSO READ: నీట్ కౌన్సెలింగ్ పై స్టే కు సుప్రీం నిరాకరణ.. కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. ఐస్ క్రీమ్ తయారు చేసిన కంపెనీ ప్యాకింగ్ ప్రదేశాలను తనిఖీ చేపట్టారు. దీనిపై వివరణ కోరేందుకు ఐస్‌క్రీమ్ తయారీ సంస్థను సంప్రదించినప్పటికీ వాళ్లు స్పందించలేదు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అంటున్నారు.
ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు.. షాక్ అయిన మహిళ
ముంబైలో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు. చేతి వేలుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన పోలీసులు.
Follow👉@bigtvtelugu for more updates#Mumbai #Icecream #HumanFinger #ViralVideo… pic.twitter.com/IZ92qln8Mn
— BIG TV Breaking News (@bigtvtelugu) June 13, 2024