BigTV English

IRCTC Clarity on Online Booking: ఆన్ లైన్‌లో రైల్వే టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష.. రైల్వే శాఖ క్లారిటీ!

IRCTC Clarity on Online Booking: ఆన్ లైన్‌లో రైల్వే టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష.. రైల్వే శాఖ క్లారిటీ!

IRCTC Clarified on Online Tickets Booking Rumor: రైల్వే టికెట్లపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తుంది. ఐఆర్సీటీసీలో పర్సనల్ అకౌంట్ నుంచి తెలిసిన వారికి రైలు టికెట్స్ బుక్ చేస్తే జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించబడుతుంది అంటూ జరుగుతున్న ప్రచారంపై రైల్వే శాఖ తాజాగా స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాజాగా రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.


సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. కాగా, ఐఆర్సీటీసీలో కేవలం ఒక వ్యక్తి ఐడీతో నెలకు 12 టికెట్లు తీసుకోవచ్చు. అంతేకాదు ఆధార్ లింక్ ఉన్నవారు అయితే నెలలో 24 టికెట్లు వరకు బుక్ చేసుకునే అవకాశం కూడా రైల్వే కల్పించింది. ఈ టికెట్లు ఎటువంటి వాణిజ్యపరమైన విక్రయం కోసం కాదని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 143 కింద నేరంగా పరిగణిస్తామని రైల్వే శాఖ తెలిపింది.

ఇతరులకు రైల్వే టికెట్లు బుక్ చేయరాదని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను కొట్టిపారేసింది. కేవలం సొంత ఇంటి పేర్లు ఉంటేనే బుక్ చేసుకోవచ్చని, వేరే ఇంటి పేర్లు వారికి టికెట్ బుక్ చేసే అవకాశం లేదనే వార్తల్లో అసలు వాస్తవం లేదని పేర్కొంది. ఒకవేళ తమ ఖాతాల నుంచి టికెట్ బుక్ చేసుకుని వ్యాపారం చేయాలనుకునే ఆలోచనలు ఉంటే మాత్రం అది నేరం అని హెచ్చరించింది. కేవలం అధికారిక గుర్తింపు ఉన్న వారికి మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది.


Also Read: Dengue Alert In Bengaluru: బెంగళూరులో డెంగ్యూ డేంజర్ బెల్స్.. 3 వారాల్లో 1000 కేసులు నమోదు

Tags

Related News

Food culture: ఆ రాష్ట్రంలో మటన్, చికెన్ తెగ తినేశారు.. ఒక్క రోజులో అన్ని కోట్ల వ్యాపారమా!

Viksit Bharat Rozgaar Yojna: యువత కోసం కేంద్రం కొత్త స్కీమ్.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన

Independence Day 2025: ఎర్రకోటపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సోషల్ మీడియాపై దృష్టి

Jammu Kashmir cloudburst: జమ్మూ కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. 38 మంది మృతి.. 200 మంది గల్లంతు!

Dog population: వీధి కుక్కలు ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని?

Himachal floods: హిమాచల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వంతెనలు

Big Stories

×