BigTV English

IMD warns Wayanad: మరోసారి వణికిపోతున్న వయనాడ్.అప్రమత్త హెచ్చరికలు జారీ

IMD warns Wayanad: మరోసారి వణికిపోతున్న వయనాడ్.అప్రమత్త హెచ్చరికలు జారీ

IMD warns of heavy rain in landslide-hit Wayanad: వాతావరణ శాఖ హెచ్చరికలతో మరోసారి వయనాడ్ వణికిపోతోంది. ఇప్పటికే కొండ చరియలు విరిగిపడి, ఇళ్లు, ఆస్తులు పోగొట్టుకుని నరకయాతన అనుభవిస్తున్న అక్కడి పౌరులు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో భయంతో అల్లాడిపోతున్నారు. రాగల 48 గంటలలో వయనాడ్ పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అంతేకాదు ఇప్పటికే ఆరెంజ్ ఎలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. కేరళ రాష్ట్రంలో పలు రాష్ట్రాలలో ఎల్లో ఎలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి.


అడవులు నరికేస్తున్నారు

వయనాడ్ లో ఇటీవల జరిగిన ప్రకృతి భీభత్సంలో దాదాపు 300 మంది మృతి చెందారు. కొండ చరియలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లే నేల మట్టం అయ్యాయి. ఇప్పటికీ కొండ రాళ్లను పూర్తి స్థాయిలో తొలగించలేదు అధికారులు. మండక్కై, చూరాల్ మల ప్రాంతాలు నామరూపాలు లేకుండా పూర్తిగా విధ్వంసం అయ్యాయి. అయితే వయనాడ్ లో ఈ పరిస్థితికి కారణం కేవలం మానవ తప్పిదమే అంటున్నారు. కేరళలోని అందమైన ప్రదేశాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు వస్తుంటారు. వారి వసతి కోసం పెద్ద హోటల్ నిర్వాహకులు భారీ ఎత్తున నిర్మాణాలు జరుపుతుంటారు. కొండ ప్రాంతాలలో ఇలాంటి భారీ తరహా నిర్మాణాలు జరగడం వలనే ఆ ప్రాంతంలో ఉన్న అడవులను కూడా నరికేస్తున్నారు. పర్యావరణ పరంగా అందమైన పచ్చని ఈ ప్రదేశాలను వాతావరణ కాలుష్య కేంద్రాలుగా మార్చేస్తున్నారు. దానితోనే ఇలాంటి ఉపద్రువాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నెల 20 దాకా నార్త్, సౌత్ ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×