Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో స్పై ఆపరేషన్లు.. స్టింగ్ ఆపరేషన్లు సంచలనం రేపుతున్నాయి. మాజీ సీఎం సిద్దరామయ్య టార్గెట్‌గా స్టింగ్ ఆపరేషన్ చేపట్టారనే కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌పై స్పైయింగ్ జరిగిందన్న ఆరోపణలు.. మాజీ సీఎం సిద్ధరామయ్యను ఇరుకున పెట్టేలా స్టింగ్ ఆపరేషన్ ఈ రెండు ఘటనలు కన్నడ రాజకీయాల్లో కలకలం రేపాయి. 2023లో లైంగిక వేధింపుల వీడియో కర్నాటకలోనే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఐతే తన ప్రతిష్టను దిగజార్చేందుకే పనిగట్టుకున్ని కొందరు ఆ వీడియోను సృష్టించారని.. ఈ వీడియో కల్పితమని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు సిద్దరామయ్య.
వీడియో వైరల్..
2011లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 2023లో వీడియోను రిలీజ్ చేశారు. అది పక్కా ఫేక్ వీడియో అని.. అది సర్క్యూలర్ కాకుండా చూడాలని పోలీసులను ఆశ్రయించారు సిద్దరామయ్య. సోషల్ మీడియా సహా అన్ని ఫార్మాట్లలో ఆ వీడియోను ప్రసారం చేయోద్దని పోలీసులు ఆంక్షలు పెట్టారు, లైంగిక వేదింపులకు సంబంధించి దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఐతే స్టింగ్ ఆపరేషన్ కేసులో కర్నాటక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృఫా అల్వా ఇన్‌వాల్వ్‌మెంట్ ఉందనే ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆమె నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. పార్టీ నుంచి ఆమె ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేశారు.
కర్నాటకలో ప్రకంపనలు..
అది స్టింగ్ ఆపరేషన్ కేసులో అప్ డేట్‌గా. ఇక రీసెంట్ టైమ్‌లో మెటా స్మార్ట్ గ్లాసెస్ తో స్పై వ్యవహారం కర్నాటకలో ప్రకంపనలు రేపింది. తనను, కేరళ సీఎం వీడీ సతీష్‌ను లక్ష్యంగా చేసుకొని మెటా స్మార్ట్ గ్లాసెస్ తో ట్రాప్ చేసే ప్రయత్నం చేశారన్నారు కర్నాటక సీఎం డీకే శివకుమార్. అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. ఏకంగా సీఎంలపై నిఘా పెట్టెందెవరు? మెటా గ్లాసెస్ స్పై వెనుక అసలు స్కెచ్ ఎవరిది? సిద్దరామయ్య టార్గెట్ గా స్టింగ్ ఆపరేషన్ ఎవరి పని? ఎందుకని? పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైనా కృపా అల్వా అసలు రోల్ ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పటికింగా ప్రశ్నలుగానే ఉన్నాయి.
Tags

Share