E-Paper
Advertisement

ఆర్టీసీ ఢీ కొట్టిన లారీ.. స్పాట్‌ లో 15 మంది, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు

ఆర్టీసీ ఢీ కొట్టిన లారీ.. స్పాట్‌ లో 15 మంది, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు
Advertisement

Road Accident: అతి వేగం మనుషుల ప్రాణం మీదకు తెస్తుంది. అయినా వేగం ఏమాత్రం తగ్గించలేదు వాహనదారులు. తాజాగా అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఘోరం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రమాదాల్లో ఒకరు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు

అర్ధరాత్రి కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద ఆర్టీసీ బస్సుని వేగంగా వస్తున్న గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌తోపాటు పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన గురించి తెలియగానే సమీపంలోని పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 15 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఆర్టీసీని ఢీ కొట్టిన గ్రానైట్ లారీ, రంగారెడ్డి జిల్లాలో బోల్తాపడిన కారు

Advertisement

వెంటనే అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం దాటిని ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం.  ఆసుపత్రిలో క్షతగ్రాతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

 

Advertisement

మరోవైపు రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చేవెళ్ల ప్రాంతంలో అతి వేగంగా వెళ్తున్న ఓ కారు, స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. చేవెళ్లలోని పామెన గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పొత్గల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గౌడ్ మృతి చెందాడు.

ALSO READ: ఆ మహిళ కన్నేస్తే ఇల్లు చోరీ కావాల్సిందే, అడ్డంగా పోలీసులకు చిక్కింది, హైదరాబాద్ సిటిలో..

ఘటన సమయంలో కారులో నలుగురు ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ప్రాంతంలో రోడ్డు సమస్యల వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో గతంలో చాలా ఘటనలు జరిగాయన్నది స్థానికుల మాట.

 

 

Related News

చౌటుప్పల్‌లో అర్ధరాత్రి దారుణం.. జోగిని దారుణ హత్య.. భారీగా బంగారం, నగదు దోపిడీ!

ఆ మహిళ కన్నేస్తే ఇల్లు చోరీ కావాల్సిందే, అడ్డంగా పోలీసులకు చిక్కింది, హైదరాబాద్ సిటిలో..

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1నుండి వాటర్ ట్యాంకర్లు..?

అమిత్ షా మహా పాదయాత్రతో.. రాంచందర్ రావు కీలక ఆదేశాలు జారీ!

తెలంగాణకు అమిత్ షా రాక.. హైదరాబాద్‌ పర్యటనకు షెడ్యూల్ ఖరారు!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని స్పాట్‌లో వ్యక్తి మృతి!

రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద.. హైడ్రా సంచలన కూల్చివేతలు!

Big Stories

Advertisement
×