Assam Bus Delivery: అసోంలోని గువాహటి నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మార్గమధ్యలో ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు రావడంతో.. తోటి ప్రయాణికులు ఆమెకు ప్రసవం చేశారు. బస్సు డ్రైవర్ సకాలంలో స్పందించి బస్సును ఆపడం, తోటి ప్రయాణికులు మానవత్వం చాటుకోవడంతో తల్లి, బడ్డ ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. పండంటి ఆడిబిడ్డకు ఆ ప్రయాణికులు జన్మనిచ్చింది.
సదరు గర్భిణి తన ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి బస్సు ఎక్కింది. కాజీరంగా సమీపానికి బస్సు చేరుకునేసరికి ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. ఊహించని ఈ పరిణామంతో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు, ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కేకలు వేశారు. వెనుక నుంచి ఆ అరుపులు విన్న డ్రైవర్.. సమయస్ఫూర్తితో వ్యవహరించారు. బస్సును వెంటనే రోడ్డు పక్కన నిలిపివేశాడు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని.. తక్షణమే ప్రసవానికి ఏర్పాట్లు చేయడానికి సహకరించారు.
A woman gave birth to a baby girl inside a moving night bus named Aideujaan, travelling from Guwahati to Dibrugarh in Assam. The bus driver and helper are being widely praised for their humanity and compassion. #assam #guwahati #dibrugarh #humanity https://t.co/ybtV0wgcTD
— Sudarshan Northeast (@SudarshanNewsNE) October 30, 2026
గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం లేదని గ్రహించిన తోటి మహిళా ప్రయాణికులు సైతం మహిళ ప్రసవానికి సాయం చేశారు. మరోవైపు మగ ప్రయాణికులు దుప్పట్లు, దుస్తుల సాయంతో బస్సులోనే కాన్పు లాంటి గదిని ఏర్పాటు చేసి.. అనంతరం వాహనం దిగిపోయారు. కుటుంబ సభ్యులు, తోటి మహిళా ప్రయాణికుల సాయంతో ఆమె బస్సులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Also Read: ఫైవ్‌స్టార్ హోటల్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో కరెంటు షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి!
ఈలోపే అంబులెన్స్ కు సమాచారం వెళ్లడంతో హుటాహుటీనా ఘటన స్థలికి చేరుకొని.. తల్లి, బిడ్డను సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, సమయస్ఫూర్తితో వ్యవహరించిన ప్రసవానికి ఏర్పాట్లు చేసిన డ్రైవర్, గర్బిణికి ప్రత్యక్షంగా సాయం చేసిన మహిళా ప్రయాణికులపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read: TRAI దెబ్బకు దిగొచ్చిన టెలికాం కంపెనీలు.. Vi నుంచి రూ.179కే అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్స్!