Panchkula School: హర్యానాలోని పంచ్‌కులాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. వార్తల్లో వినడమే కాకుండా, ఊహించుకోవడానికే భయమేసే ఒక దారుణం స్కూల్ క్లాస్‌రూమ్‌లోనే జరిగింది. ఆరేళ్ల ఒక చిన్నారిపై, ఎనిమిదేళ్ల బాలుడు చేసిన దాడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తోటి విద్యార్థిని కిందపడేసి, కాళ్లతో తన్నుతూ, చిన్నారి తలను స్కూల్ బెంచ్‌కు, నేలకు బాదడమే కాకుండా.. ఇటుకతో పదేపదే తలపై కొట్టడం ఎంతటి రాక్షసత్వం!
క్లాస్‌రూమ్‌లో టీచర్లు ఏం చేస్తున్నారు?
బడులు పిల్లలకు అత్యంత సురక్షితమైన ప్రదేశాలు అని నమ్మి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపుతారు. కానీ, ఒక క్లాస్‌రూమ్‌లో ఇద్దరు పిల్లల మధ్య ఇంత దారుణం జరుగుతుంటే అక్కడ ఉపాధ్యాయులు లేదా సిబ్బంది ఏం చేస్తున్నారు? ఆ చిన్నారి ఆర్తనాదాలు ఎవరికీ వినపడలేదా? పాఠశాలల పర్యవేక్షణలో ఇంత నిర్లక్ష్యం తగునా? అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిదేళ్ల పిల్లాడిలో ఇంత క్రూరత్వమా?
ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఆ బాలుడి వయస్సు. ఎనిమిదేళ్ల చిన్నారికే అంత హింసాత్మకమైన ఆలోచనలు, క్రూరత్వం ఎలా వచ్చాయి? నేటి డిజిటల్ యుగంలో పిల్లలు చూస్తున్న హింసాత్మక వీడియో గేమ్‌లు, మొబైల్ కంటెంట్ లేదా ఇంట్లో చూసే వాతావరణం వారిపై ఈ స్థాయిలో ప్రభావం చూపుతోందా?
చిన్నారిపై 3వ తరగతి బాలుడు దాడి.. ఇటుకలతో తలపై కొట్టి..!
హర్యానాలోని పంచకూర్ల సెక్టార్-20 సంస్కృతి మోడల్ స్కూల్లో దారుణ సంఘటన జరిగింది. కేజీ చదువుతున్న ఓ చిన్నారిపై 3వ తరగతి బాలుడు ఇటుకలు, పూలకుండీలతో దాడి చేశాడు. స్పృహ కోల్పోయినప్పటికీ దాడిని కొనసాగించడంతో ఆ చిన్నారి తీవ్రంగా… pic.twitter.com/YyEPpS1nrb
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2026
పోలీసుల విచారణ..
ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. కానీ, ఇది కేవలం పోలీసుల దర్యాప్తుతో ముగిసే విషయం కాదు. మన పిల్లలను ఎలా పెంచుతున్నాం, వారి ప్రవర్తనను ఎలా గమనిస్తున్నాం అని ప్రతి ఒక్క తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది.
Also Read: ర్యాపిడోలో బంగారం పార్సిల్.. చేతివాటం చూపించిన డెలివరీ బాయ్!