BMW Woman Driver: ముంబైలోని ఓ బిజీ రోడ్డులో నిన్న రాత్రి తీవ్ర కలకలం రేగింది. బీఎండబ్లూ కారులో అతివేగంగా వచ్చిన ఓ మహిళ ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా తప్పును ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసుతోనే దురుసుగా ప్రవర్తించింది. ఆపై పోలీసును కారుతో ఢీకొట్టేందుకు యత్నించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును బీఎండబ్ల్యూలో వచ్చిన మహిళ తొలుత ఢీకొట్టింది. ఆపై అక్కడి నుంచి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రశాంత్ హాకే అడ్డుకున్నారు. కారును పక్కకి తీయాలని ఆదేశించారు. అయితే కానిస్టేబుల్ మాటను వినిపించుకోకుండా ఆమె కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశారు. కారుకు అడ్డంగా కానిస్టేబుల్ నిలబడినప్పటికీ.. ఆమె వెనక్కి తగ్గలేదు. ఏకంగా పోలీసు మీదకు కారును ఎక్కించేందుకు యత్నించారు.
BMW DRIVER CLASHS WITH TRAFFIC POLICE IN MUMBAI !!!
A video from Juhu shows a woman driving a BMW continuing to move her car despite repeated instructions from a traffic police officer to stop. The vehicle was allegedly involved in collisions with a scooter, motorcycle and another car before the incident. A bystander is seen opening the car’s rear door as the situation escalates.
The woman later records people surrounding her and alleges that she is being harassed.
@MTPHereToHelp @CPMumbaiPolice
— Ravi Prakash Official (@raviprakash_rtv) October 31, 2026
ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో అవి వైరల్ గా మారాయి. రోడ్డుపై సదరు మహిళ హల్ చల్ చేయడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి.. ఆమెను నిలదీసేందుకు యత్నించాడు. కారు వెనుక డోర్ తెరిచి ఆమెను ప్రశ్నించబోయాడు. ఈ క్రమంలో ఆమె వెంటనే తన మెుబైల్ ను బయటకు తీసి.. అతడ్ని ఫోన్ లో రికార్డ్ చేయడం ప్రారంభించింది. తనను అందరూ వేధిస్తున్నారంటూ పెద్దగా కేకలు వేయడం మెుదలుపెట్టింది. పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నట్లు గ్రహించిన ఆమె.. అక్కడి నుంచి వేగంగా కారులో వెళ్లిపోయింది.
బాధితుడైన మరో కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు జూహు (Juhu) పోలీస్ స్టేషన్ లో సదరు మహిళాపై కేసు నమోదు చేశారు. అలాగే ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై చలానాలు సైతం విధించారు. ప్రస్తుతం కారు నెంబర్ ఆధారంగా యువతి ఆచూకీని కనుగొనే పనిలో ట్రాఫిక్ పోలీసులు పడ్డారు. కారును ఢీకొట్టడం, పోలీసు విధులకు అడ్డుపడటం వంటి సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
Also Read: రన్నింగ్ బస్సులో పురిటి నొప్పులు.. మహిళా ప్రయాణికుల సాయం.. బిడ్డకు జన్మనిచ్చిన యువతి!