Watch Video: ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాద ప్రమాదాల నడుమ ఓ శబ్దం కూడా పాకిస్తాన్ జనాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇప్పుడు ఆ దేశాన్ని వదలకుండా వెంటాడుతోన్న మరో భయం.. ఇండియా ఫోబియా. సాధారణంగా ఆకాశంలో విమానం కనిపించినా అది భారత వాయుసేనదేనేమో అని పాకిస్తానీయులు భయంతో పరుగులు తీస్తున్నారు.
ఈ మధ్య పాకిస్తాన్‌లో అనేక ప్రాంతాల్లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో మహిళలు, చిన్న పిల్లలు, ముసలివాళ్లు అందరూ ఇండియా డ్రోన్ వచ్చేసిందట, ఇది ఇండియా ఫైటర్ జెట్ అంటూ కేకలు వేస్తూ రహదారులపై పరుగులు తీస్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన భారతీయులు ఆశ్చర్యపోవడమే కాదు, కొంతమంది ఈ ఫోబియాను జోక్‌లుగా మార్చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
పాక్‌లో జెట్ శబ్దమే భయం!
గత కొద్ది వారాలుగా పాక్ వైమానిక దళం తూర్పు సరిహద్దుల్లో గగనతలంలో పెట్రోలింగ్ ముమ్మరం చేసింది. అయితే, ఆ విమానాలు ఎగురుతున్న శబ్దం విని పాకిస్తాన్ ప్రజలు తెగ భయపడి పోతున్నారట. చాలామంది వాటిని భారత వాయుసేన జెట్‌లుగా అనుమానించి, గ్రామాల్లో పంచాయితీ భవనాలు, స్కూళ్లు ఖాళీ చేసి భద్రమైన ప్రదేశాలకు పరుగులు పెడుతున్నారు.
ఒక వీడియోలో పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో ప్రజలు భారత డ్రోన్ వచ్చిందంటూ గంపలు, పాత్రలు, పిల్లలను తీసుకుని పొలాల్లోకి పరుగులు తీస్తున్న దృశ్యం కనిపించింది. మరో వీడియోలో చిన్నారులు ఇండియా జెట్ వచ్చింది, పారిపోండి అంటూ కేకలు పెడుతూ పరుగెడుతున్నారు.
అంతా ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్..
2019 ఫిబ్రవరిలో బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన సర్జికల్ దాడులు ఇప్పటికీ పాకిస్తాన్ ప్రజల మనసులో భయంగా చెరిపిపోని ముద్ర వేసినట్లు కనిపిస్తోంది. అలాగే ఇటీవల పాక్ ఉగ్ర మూకలే లక్ష్యంగా మన దేశం జరిపిన దాడులు కూడా ఇందుకు ఒక కారణం. అప్పటినుంచి భారత్ నుండి ఏదైనా శబ్దం వచ్చినా ఆ వైపు చూడకుండా ముందుకు పరుగులు తీస్తుండటం అక్కడ వాస్తవంగా మారింది.
Also Read: Pakistan Army Killed: గురి చూసి లేపేశారు.. పాక్ ఆర్మీని ఏరిపారేస్తున్న బలూచ్ జవాన్లు
ఈ వీడియోలు ఇప్పటివో, లేక పాత వీడియోలో కానీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇండియా డ్రోన్ రావడమే కాదు.. ఇప్పుడీ శబ్దంతోనే పాక్ జనాలు భయపడిపోతున్నారట అంటూ భారతీయ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక పాకిస్తాన్ భద్రతా విభాగాలు మాత్రం ఈ ఫోబియా వల్ల ప్రజల్లో ఆందోళనలు, అవాస్తవ ప్రచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నాయట. ప్రజలను ఈ భయాల నుంచి బయటపడేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.
పాకిస్తాన్‌ను వెంటాడుతున్న ఇండియా ఫోబియా..
విమానం కనిపిస్తే భయంతో పరుగులు తీస్తున్న పాకిస్తానీయులు
ఇండియా డ్రోన్ వచ్చేసిందంటూ అరుస్తూ పరుగులు
పాక్ ఎయిర్ ఫోర్స్ విమానాలు వచ్చినా ఇండియా విమానాలే అనుకుంటున్న జనం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు pic.twitter.com/sbJs06rfHf
— BIG TV Breaking News (@bigtvtelugu) May 15, 2025