BigTV English

Pakistan Air Base Destroyed: ఎయిర్ బెస్‌లు తుక్కు తుక్కు.. ఇండియా దెబ్బతో పాక్ షేక్

Pakistan Air Base Destroyed: ఎయిర్ బెస్‌లు తుక్కు తుక్కు.. ఇండియా దెబ్బతో పాక్ షేక్

Pakistan Air Base Destroyed: భారత్‌ దాడికి పాకిస్థాన్ ఫేసే కాదు..ఎయిర్‌బేసులు పగిలిపోతున్నాయి. ఇండియన్ ఆర్మీ మిస్సైళ్ల ధాటికి.. పాకిస్థాన్‌లోని కీలక ఎయిర్‌బేస్‌లు తుక్కు తుక్కు అవుతున్నాయి. మే 9న త్రివిధ దళాల దాడుల్లో.. పాక్ సైనిక కార్యాకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న 8 ఎయిర్‌ బేస్‌లు ధ్వంసం అయ్యాయి. భారత్‌ ఎటాక్‌కు సమాధానం చెప్పలేక.. పాక్‌ కుయ్యో మొర్రో అంటోంది.


మే 9.. పాకిస్థాన్ హిస్టరీలో ఒక కాళరాత్రి

మే 9వ తేదీ ఖచ్చితంగా పాకిస్థాన్‌ జీవితంలో ఒక కాళరాత్రి అని చెప్పాలి. మొత్తం 8 ఎయిర్‌బేస్‌లను భారత ఆర్మీ భూస్థాపితం చేశాయి ఇండియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జాంగ్‌ జిల్లాలో ఉన్న రఫికి ఎయిర్‌బేస్‌ను భారత సైన్యం తుక్కు తుక్కు చేసింది. ఈ ఎయిర్‌బేస్ పాక్‌ సైనిక కార్యకలాపాల్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది ఇస్లామాబాద్‌కు 337 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10 వేల అడుగుల రన్‌వేను కలిగి ఉంది. దీంతో పాటు ఈ ఎయిర్‌బేస్‌ ఎమర్జెన్సీ ల్యాండిగ్‌ స్ట్రిప్‌ కూడా కలిగి ఉంది. భారత్‌ ధ్వంసం చేసి మరో వైమానిక స్థావరం మురిద్. ఇది పంజాబ్‌లోని చక్వాల్ జిల్లా సమీపంలో ఉంది. ఇది పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు అత్యంత కీలకమైన ప్రదేశం. ఇక్కడే పాకిస్థాన్‌కు చెందిన మానవ రహిత వైమానిక వాహనం, మానవరహిత పోరాట వైమానిక వాహనాలను పాక్ దాచి ఉంచింది.


ఇస్లామాబాద్‌కు 10 కి.మీల దూరంలోని చక్లాలా ఎయిర్‌బేస్

నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరంగా పిలిచే చక్లాలా ఎయిర్‌బేస్‌ కూడా భారత దళాల దాడుల్లో ధ్వంసమైంది. ఇది ఇస్లామాబాద్‌కు 10 కిలో మీటర్ల దూరంలోని రావల్పిండిలో ఉంది. ఇది భుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉంది. ఇది పాకిస్థాన్‌ నేవి కార్యకలాపాల్లో కీ రోల్ పోషిస్తుంది.

రహిం యార్ ఖాన్ ఏయిర్‌బేస్‌ను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌లో దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన రహిం యార్‌ ఖాన్ ఏయిర్‌బేస్‌ను భారత్ ధ్వంసం చేసింది. ఈ ఏయిర్‌బేస్ రాజస్తాన్ సరిహద్దు ప్రాంతానికి అతి దగ్గరలో ఉంది. మిలటరీ కార్యకలాపాలతో పాటు సివిల్ ఏవియేషన్‌కు కూడా దీన్ని వాడుతోంది. చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఏయిర్‌బేస్, ఇంటర్‌నేషనల్ ఏయిర్‌పోర్టును భారత్ కోలుకోలేని దెబ్బతీసింది.

సుక్కూరి ఎయిర్‌బేస్‌పై కూడా దాడి

భోలారి వైమానిక స్థావరంగా పిలిచే సుక్కూరి ఎయిర్‌బేస్‌ను మన దళాలు నేలమట్టం చేశాయి. పాకిస్థాన్‌ హైదరాబాద్‌లోని సింధ్‌లో జంషోర్‌ జిల్లాలో ఉన్న ఈ ఎయిర్‌బేస్.. F-16A బై B బ్లాక్ 15 ADF విమాన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. పాక్ సౌత్ నేవి కమాండ్‌ పరిధిలో ఉంది. ఈ ఎయిర్‌బేస్‌లో ఇటీవలే 19 స్వ్కాడ్రన్‌, ఆపరేషన్ కన్వర్షన్‌ యూనిట్‌ ప్రారంభమైంది. అంతలోనే భారత్ దెబ్బకు కోలుకోలేని స్థితికి చేరుకుంది.

రాడార్ సైట్‌ను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ ఆర్మీ ప్రాథమిక కార్యాచరణ స్థావరాల్లో చునియన్ వైమానిక స్థావరం కూడా ఒకటి. లాహోర్‌కు దక్షిణంగా 70 కిలో మీటర్ల పరిధిలో పాక్‌ పంజాబ్‌లో ఉంది. ఇది కూడా భారత్‌ దెబ్బకు బలహీనమైపోయింది. అలాగే పస్రూర్‌లోని రాడార్ సైట్‌ను ధ్వంసం చేసింది భారత్. పస్రూర్‌లో ఈ ఎయిర్‌బేస్ ఉంది. ఇక సియాల్‌కోట్ ఏవియేషన్ బేస్‌ను భారత్‌ చిత్తు చిత్తు చేసింది. ఇది పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా ఉపయోగపడుతోంది. ఇందులో రెండు ఎయిర్‌పోర్టులు ఉండగా.. కంటోన్మెంట్‌ ఎయిర్‌పోర్టులో సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది పాక్.

Also Read: ఆ తప్పే కేసీఆర్ కొంపముంచిందా? 

భారత్‌ ధాటికి.. పాక్‌ ఆర్థికంగా కోలుకోవడానికి చాలా ఏళ్లే పడుతుంది. అంతలా నష్టపోయింది. ఇలా కీలక ఎయిర్‌బేస్‌లపై తమ ప్రతాపం చూపిన ఇండియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌.. ఇప్పుడు తమ నెక్ట్స్‌ టార్గెట్స్‌పై కన్నేసి రెడీగా ఉన్నాయి.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×