BigTV English

Tollywood Movie Shooting Updates: ఏ మూవీ ఎక్కడ షూటింగ్ జరుగుతోందో తెలుసా..?

Tollywood Movie Shooting Updates: ఏ మూవీ ఎక్కడ షూటింగ్ జరుగుతోందో తెలుసా..?

Tollywood Movie Shooting Updates:ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే.. ఒక సినిమా వస్తోంది అంటే ఆ సినిమా అప్డేట్ తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ సినిమాలో ఎవరు నటిస్తున్నారు? ఎవరు నిర్మిస్తున్నారు? దర్శకుడు ఎవరు? హీరో, హీరోయిన్లు ఎవరు..? మిగతా తారాగణం సంగతేంటి? కథ నేపథ్యం ఏమిటి? మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారు? ఇలా సినిమాకు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా యంగ్ హీరోలను మొదలుకొని స్టార్ హీరోల వరకు చాలామంది తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందులో భాగంగానే ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఈరోజు ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.


ప్రభాస్ – రాజాసాబ్ :

స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas) వరుస లైనప్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఆయన ప్రముఖ డైరెక్టర్ మారుతీ (Maruthi ) దర్శకత్వంలో ‘ రాజా సాబ్ ‘ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ‘కీసర’ దగ్గర జరుగుతోంది.


మహేష్ బాబు – ఎస్ ఎస్ ఎం బి 29:

భారీ అంచనాల మధ్య పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఎస్ ఎస్ ఎమ్ బి 29(SSMB 29). మహేష్ బాబు(Maheshbabu ) , రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శంకరపల్లి జనవాడలో వేసిన భారీ సెట్లో ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుగుతోంది.

బాలకృష్ణ – అఖండ 2:

బాలకృష్ణ(Balakrishna ), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని , బాలకృష్ణకు ఊహించని విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ అఖండ 2 తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సంఘీ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.

రవితేజ – మాస్ జాతర :

ప్రస్తుతం రవితేజ (Raviteja ), భాను భోగవరపు (Bhanu bhogavarapu) దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జనవాడలో జరుగుతోంది.

వరుణ్ తేజ్ – VT 15:

ప్రస్తుతం వరుణ్ తేజ్ (Varun Tej), మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో VT 15 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. హార్రర్ , కామెడీ జానర్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.

సాయి ధరంతేజ్ – సంబరాల ఏటిగట్టు :

ప్రముఖ హీరో సాయి ధరంతేజ్ (Sai Dharam Tej)హీరోగా ‘హనుమాన్’మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకరాలలో జరుగుతోంది.

తేజ సజ్జ – మిరాయ్:

హనుమాన్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టేటస్ ని సొంతం చేసుకున్న చైల్డ్ ఆర్టిస్టు తేజ .. ప్రస్తుతం మిరాయ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగు అజీజ్ నగర్ లో జరుగుతోంది.

విశ్వక్ సేన్ – ఫంకీ :

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) అనుదీప్ (Anudeep) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఫంకీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.

అక్కినేని నాగచైతన్య – NC 24 :

అక్కినేని నాగచైతన్య, ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఎన్సీ 24. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫైర్ స్టేషన్ దగ్గర జరుగుతోంది.

అఖిల్ అక్కినేని – లెనిన్:

అఖిల్ అక్కినేని, మురళీ కిషోర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం లెనిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతోంది.

ALSO READ:Balakrishna: ‘ఆదిత్య 999’ విషయంలో బాలయ్య షాకింగ్ డెసిషన్.. బాధ్యత వారికే..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×