E-Paper
Advertisement

Flight Ticket Rates: హమ్మయ్య.. విమాన టికెట్ ధరలకు కళ్లెం వేసిన కేంద్రం, ఎన్ని కి.మీలకు ఎంతంటే?

Flight Ticket Rates: హమ్మయ్య.. విమాన టికెట్ ధరలకు కళ్లెం వేసిన కేంద్రం, ఎన్ని కి.మీలకు ఎంతంటే?
Advertisement

Flight Ticket Rates: ఇండిగో విమానాల రద్దుతో ఇతర ఎయిర్ లైన్స్, మధ్యవర్తులు ఫ్లైట్ టికెట్లకు భారీగా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. విమానాల టికెట్ల ధరలను నియంత్రించేందుకు గరిష్ట రేట్లను ప్రకటించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దేశీయ విమాన సర్వీసులకు రేట్లు ప్రకటించింది. పరిమితుల కంటే ఎక్కువ ఛార్జీలను వసూలు చేయకూడదని పేర్కొంది.

టికెట్ ధరలు ఇలా(గరిష్టంగా)

  • 500 కి.మీ వరకు- రూ.7,500
  • 500-1000 కి.మీ – రూ.12,000
  • 1000-1500 కి.మీ – రూ.15,000
  • 1500 కి.మీ. పైన – రూ.18,000

ఈ ఛార్జీలకు యూడీఎఫ్, పీఎస్ఎఫ్, ఇతర పన్నులకు మినహాయింపు ఇచ్చింది. ఈ ఛార్జీ పరిమితులు బిజినెస్ క్లాస్, ఆర్సీఎస్ ఉడాన్ విమానాలకు వర్తించవని పేర్కొంది.

Advertisement

ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో విమానయాన సంస్థల ఛార్జీలపై కేంద్రం పరిధి విధించింది. ఇండిగో విమానాల రద్దు తర్వాత సర్ ఛార్జీలను అరికట్టడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాత్కాలిక ఛార్జీల పరిమితిని విధించింది. 500 కిలోమీటర్ల దూరం వరకు విమానాలకు, విమానయాన సంస్థలు గరిష్టంగా రూ.7,500 ఛార్జ్ చేయవచ్చు. 500 కి.మీ నుండి 1,000 కి.మీ మధ్య దూరం ఉన్న విమానాలకు, గరిష్టంగా రూ.12,000 ఛార్జ్ చేయవచ్చు. 1,500 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న విమానాలకు, గరిష్టంగా టికెట్ పై రూ.18,000 ఛార్జ్ చేయవచ్చు.

Also Read: IndiGo Tickets Refund: రిఫండ్ వెంటనే చెల్లించాలి.. రేపటికల్లా విమానాలు నడకపోతే తీవ్ర చర్యలు.. కేంద్రం వార్నింగ్ 

రిఫండ్ లపై కీలక ఆదేశాలు

Advertisement

వరుసగా ఐదో రోజు కూడా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండడంతో, ప్రైవేట్ క్యారియర్ విమాన సేవలలో టికెట్ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం విమాన ఛార్జీలపై పరిమితిని ప్రకటించింది. రద్దు చేసి టికెట్ల రిఫండ్ ను వెంటనే చెల్లించాలని కూడా కేంద్రం ఇండిగోను ఆదేశించింది. రద్దు చేసిన అన్ని విమానాల రిఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి 8:00 గంటలలోపు పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇండిగోతో బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నందున మంత్రిత్వ శాఖ టికెట్ల రేట్లపై నియంత్రణ విధించింది.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×