E-Paper
Advertisement

Teenmar Mallanna: బయటపడ్డ తీన్మార్ మల్లన్న డ్రామాలు.. బిగ్ టీవీపై విషం కక్కి.. వితండవాదం

Teenmar Mallanna: బయటపడ్డ తీన్మార్ మల్లన్న డ్రామాలు.. బిగ్ టీవీపై విషం కక్కి.. వితండవాదం
Advertisement

Teenmar Mallanna: ఈశ్వరచారి మృతి విషయంలో బిగ్‌ టీవీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తీన్మార్ మల్లన్న కుల రాజకీయాల రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఈశ్వరచారి మృతిపై ఈ రోజు బిగ్‌ టీవీ ఛానల్‌కు మల్లన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. బీసీ రిజర్వేన్ల కోసమే ఈశ్వరచారి బలిదానం చేసుకున్నారని ఆ ఇంటర్వ్యూలో మల్లన్న స్పష్టం చేశారు. అయితే, మృతుడు ఈశ్వరచారి భార్య కవిత విడుదల చేసిన ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆర్థిక సాయం చేసిన వీడియోను మల్లన్న వైరల్ చేయటం వల్లే ఈశ్వరచారి మనస్థాపానికి గురయ్యారని కవిత ఆ ఆడియోలో చెప్పారు. ఈ ఆడియో గురించి ఇంటర్వ్యూలో బిగ్‌టీవీ మల్లన్నను ప్రశ్నించింది.

ఇంటర్వ్యూలో సమాధానం చెప్పలేకనే.. ఇలా..?

Advertisement

ఈ సందర్భంగా బిగ్ టీవీపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలలో బిగ్ టీవీ ఒకటి అని వ్యాఖ్యానించారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంగా తీన్మార్ మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారు. బిగ్ టీవీ అగ్రవర్ణాలకు సంబంధించిన మీడియా అని అన్నారు.

ప్రశ్నలకు జవాబు చెప్పలేని మల్లన్న వెంటనే బిగ్‌టీవీపై కుల ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పుడు మల్లన్నకు లేని అభిప్రాయం, కవిత ఆడియోపై ప్రశ్నించగానే వచ్చిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిజంగా బిగ్‌టీవీ బీసీలకు అన్యాయం చేస్తోందన్న భావన మల్లన్నకు ఉంటే అసలు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. తీన్మార్ మల్లన్న డబుల్ గేమ్ ఆడుతున్నారని జనాలు చర్చించుకుంటున్నారు.

Advertisement

కవిత ఆడియోలో చెప్పిన విషయాలకు సరైన సమాధానం చెప్పుకోలేక మల్లన్న బిగ్‌టీవీపై నిందలు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిగ్‌టీవీ ఏంటో.. దానికి ఉన్న సామాజిక స్పృహ ఏంటో ప్రజలకు తెలుసు.. మల్లన్న సర్టిఫికెట్ బిగ్‌టీవీకి అక్కర్లేదు. బిగ్‌టీవీలో అన్ని కులాలు, మతాల వాళ్లు పనిచేస్తున్నారు. ఎప్పుడూ కులాన్ని క్యాష్ చేసుకోవాలని బిగ్‌టీవీ అనుకోలేదు.. అనుకోదు.

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×