E-Paper
Advertisement

Ind vs Sa 3rd Odi: చెత్త బౌలర్ అంటూ ట్రోలింగ్.. బంతితో ప్రసిద్ అదిరిపోయే కౌంటర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Ind vs Sa 3rd Odi: చెత్త బౌలర్ అంటూ ట్రోలింగ్.. బంతితో ప్రసిద్ అదిరిపోయే కౌంటర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే
Advertisement

Ind vs Sa 3rd Odi: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య నేడు నిర్ణయాత్మక మూడో వన్డే విశాఖ వేదికగా వైయస్ రాజశేఖర్ రెడ్డి {ఏసీఏ – విడిసిఏ} మైదానం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. రెండు సంవత్సరాల 21 రోజుల తర్వాత టీమిండియా టాస్ గెలిచింది. ఇక మొదట సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించగా.. తొలి ఓవర్ లోనే టీమ్ ఇండియాకు శుభారంభం దక్కింది. తొలి ఓవర్ లోనే అర్షదీప్ సింగ్ వికెట్ తీసుకున్నాడు.

Also Read: Ind vs Sa 3rd Odi: టీమిండియా ఓడిపోవాలని క్షుద్ర పూజలు.. తెరపైకి కొత్త స్వామీజీ

Advertisement

అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కే.ఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు ర్యాన్ రికెల్టన్. ఆ తర్వాత ఓపెనర్ డికాక్.. కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి దూకుడు పెంచాడు. తద్వారా 42 బంతుల్లోనే డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే జడేజా వేసిన 21వ ఓవర్ చివరి బంతికి బావుమా {48} హాఫ్ సెంచరీ ముంగిట విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక 29వ ఓవర్ లో ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ లో మ్యాథ్యూ బ్రిట్జ్కే {24} ఎల్బిడబ్ల్యుగా వెనుదిరిగాడు. ఇక అదే ఓవర్ చివరి బంతికి మార్క్క్రమ్ {1} విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

 

డికాక్ అద్భుత సెంచరీ:

Advertisement

అయితే ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ డికాక్ 80 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత 199 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా ఐదవ వికెట్ కోల్పోయింది. 89 బంతుల్లో 106 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. ప్రసిద్ద్ కృష్ణ వేసిన 32.5 బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డికాక్ తన ఇన్నింగ్స్ లో ఆరు సిక్స్ లు, 8 ఫోర్లు బాదాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ వేసిన 39 ఓవర్ తొలి బంతికే రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు డేవాల్డ్ బ్రివిస్. బ్రేవిస్ 29 పరుగులు చేశాడు.

ఇక అనంతరం బాష్ క్రీజ్ లోకి వచ్చాడు. అనంతరం ఇదే 38వ ఓవర్ మూడవ బంతికి మార్కో యాన్సెన్ {17} భారీ షాట్ కి ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద జడేజా చేతికి చిక్కాడు. ఆ తర్వాత 42 ఓవర్ మూడవ బంతికి బాష్ {9} నీ పెబిలియన్ కి పంపాడు కుల్దీప్ యాదవ్. ఇక 45వ ఓవర్ నాలుగవ బంతికి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎంగిడి {1} ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ చేరాడు. ఇక ప్రసిద్ద్ కృష్ణ తన చివరి ఓవర్ ఐదవ బంతికి బార్ట్ మాన్ {3} ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 1, ప్రసిద్ద్ కృష్ణ 4, కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

 

చెత్త బౌలర్ అంటూ ట్రోలింగ్.. బంతితోనే ప్రసిద్ద్ అదిరిపోయే కౌంటర్:

రాయిపూర్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో అత్యధిక పరుగులు ఇచ్చి ప్రసిద్ద్ కృష్ణ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇతడి కారణంగానే గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ చేజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండవ వన్డేలో 8.2 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిద్ద్ ఏకంగా 85 పరుగులు ఇచ్చాడు. అతని ఎకానమీ రేట్ 10.20 గా ఉండడం గమనార్హం. దీంతో ప్రసిద్ద్ కృష్ణ పేలవమైన ప్రదర్శన తర్వాత అతడి వన్డే కెరీర్ ప్రమాదంలో పడిందని కూడా వ్యాఖ్యానించారు.

Also Read: Hardik Pandya: AMB సినిమాస్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. అఖండ 2 కోసమేనా?

సోషల్ మీడియా వేదికగా అతనిపై పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కానీ వీటన్నింటికీ మూడవ వన్డే వేదికగా సమాధానం చెప్పాడు ప్రసిద్ద్. మొదట కాస్త పరుగులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాడు. ముఖ్యంగా సెంచరీ చేసి మంచి ఊపులో సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్న డికాక్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో 9.5 ఓవర్లు భౌటింగ్ చేసిన ప్రసిద్ద్ కృష్ణ 66 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×