Big Stories

India China Border : సరిహద్దులో మళ్లీ భారత్ చైనా ఘర్షణ..

India China Border : భారత్ చైనా సరిహద్దులో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టాద్ వద్ద చైనా వాస్తావాధీన రేఖను దాటి భారత్‌లోకి పెట్రోలింగ్‌కి వచ్చాయి. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో 7 నుంచి 20 మంది భారత సైనికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అటు చైనా లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులే ఈ ఘర్షణలో ఎక్కువగా గాయపడ్దారు. చైనా పెట్రోలింగ్ సమయంలో హద్దులు దాటి భారత భూభాగంలొకి ప్రవేశిస్తుంది. దీన్ని గమనించిన భారత్ సరిహద్దులో ఫైటర్ జట్లతో గస్తీ కాస్తోంది.

- Advertisement -

ఇటీవల భారత్, అమెరికా కలిసి యుద్ధ విన్యాసాలు చేశాయి. యుద్ధ అభ్యాస్ 2022 పేరుతో నవంబర్ 17 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు ఈ విన్యాసాలు జరిగాయి. చైనా సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాఖండ్‌లో ఈ విన్యాసాలు జరిగాయి.

ఈ యుద్ధ విన్యాసాలు ముగిసిన వారం తరువాత చైనా పెట్రోలింగ్‌లో సరిహద్దు వద్ద హద్దు మీరింది. మరో వైపు భారత్-చైనా సరిహద్దు విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని చైనా గతంలో అమెరికాను హెచ్చరించింది. యుద్ధ విన్యాసాలు భారత్‌తో ఎవరకు చేయాలో కూడా మూడో దేశం చెప్పవలసిన అవసరం లేదన్నారు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News