Big Stories

Kavitha: బీఆర్ఎస్ తో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్.. చేరికలపై కవిత క్లారిటీ

Kavitha: బీఆర్ఎస్ లో ఎవరున్నారు? అంతా టీఆర్ఎస్ వాళ్లేగా? మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ ఏమైనా గొప్ప లీడర్లా? వీళ్లతో ఢిల్లీని గెలుస్తారా? ఇలా బీఆర్ఎస్ పై విమర్శల దాడి జరుగుతోంది. అలాంటి ప్రశ్నలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. దేశంలో భారత్‌ రాష్ట్ర సమితితో కొత్త చరిత్ర సృష్టిస్తామన్నారు.

- Advertisement -

జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతోందన్నారు కవిత. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాలు ఖరారు చేస్తామన్నారు. ఏపీలో ఎన్నికలకు సమయం ఉన్నందున ఇంకా అక్కడి వ్యూహాలు ఆలోచించలేదన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని అంటూనే.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ప్రచారం చేసి ఆయన్ను ఓడిస్తా అంటూ కవిత సవాల్ చేశారు.

- Advertisement -

భారత్‌ రాష్ట్ర సమితి ఏర్పాటుతో బీజేపీ బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయిందంటూ పంజ్ లు వేశారు. బీజేపీ రణనీతిలో దర్యాప్తు సంస్థలు భాగమని.. ఆ విషయంలో భయపడేది లేదన్నారు కవిత. ప్రధాని మోదీ.. మమతా బెనర్జీని, బండి సంజయ్‌ తనను అవహేళన చేశారని.. పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పినట్టే.. తెలంగాణలోనూ కాషాయం పార్టీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు కవిత. మహిళలను బండి సంజయ్‌ అవహేళన చేస్తున్నారని.. బతుకమ్మను అవమానించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక కేసీఆర్ చేస్తున్న రాజశ్యామల యాగంపైనా కవిత క్లారిటీ ఇచ్చారు. యాగాలు చేయడం సీఎం కేసీఆర్‌కు కొత్త కాదన్నారు. బీఆర్ఎస్ కు దైవబలం అవసరం కాబట్టే యాగాలు చేస్తున్నామని చెప్పారు.

భారత్‌ జాగృతి ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని.. రాష్ట్రంలో తెలంగాణ జాగృతి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News