BigTV English

India Vs Pakistan : లాహోర్ ఖతం.. పాక్‌పై డ్రోన్లతో అటాక్.. ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం

India Vs Pakistan : లాహోర్ ఖతం.. పాక్‌పై డ్రోన్లతో అటాక్.. ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం

India Vs Pakistan : భారత్ దెబ్బ కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా? ఇండియన్ ఆర్మీ అటాక్ చేస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో తెలుసా? మోదీకి చెబితే ఏం జరుగుతుందో తెలుసా? పాకిస్తాన్‌కు బాగా తెలిసొచ్చినట్టే ఉంది. ఆపరేషన్ సిందూర్‌తో అర్థరాత్రి ఉగ్ర స్థావరాలను స్మాష్ చేసింది. 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. దాడులతో పాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయినా, పాకిస్తాన్ బుద్ది మారలేదు. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. దీంతో, ఇండియా ఆపరేషన్ సిందూర్ ఫేజ్ 2 స్టార్ట్ చేసింది. ఈసారి డ్రోన్లతో పాక్ ఆయువుపట్టుపై దెబ్బ కొట్టింది. గురువారం ఉదయం పదుల సంఖ్యలో డ్రోన్లు.. పాక్ ప్రధాన నగరాలపై అటాక్ చేశాయి.


9 నగరాల్లో డ్రోన్ అటాక్స్

పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తోంది భారత సైన్యం. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసి చావుదెబ్బ కొట్టింది. కీలక నగరాలైన లాహోర్, కరాచీ, రావల్పిండి, అట్టోక్‌, గుజ్రన్‌వాలా, చక్వాల్‌, బహ్వల్‌పూర్, మైనివాలి, చోర్‌ ప్రాంతాల్లో అటాక్ చేసింది. లాహోర్ విమానాశ్రయంలో పేలిన డ్రోన్ బాంబులు భారత్ పనే. వెంటనే ఆ ఎయిర్‌పోర్టును మూసేసింది పాక్. కరాచీ మినహా ఆ దేశంలోని అన్ని విమానాశ్రయాలను బంద్ చేసింది. లాహోర్, ఇస్లామాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇతర నగరాల్లో వార్ సైరన్స్‌ మోగుతున్నాయి. భారత్‌ డ్రోన్‌లు తమపై దాడులు చేశాయంటూ పాక్ ఆర్మీ డీజీ స్వయంగా ప్రకటించారు.


ఎయిర్ డిఫెన్స్ సిస్టం స్మాష్

లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. చైనాకు చెందిన HQ-9 డిఫెన్స్ సిస్టమ్‌ను పాకిస్తాన్ వాడుతోంది. వాటిని టార్గెట్‌గా చేసుకుని భారత డ్రోన్లు దాడులు చేశాయి. సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి దూసుకెళ్లాయి. దెబ్బకు ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం అయింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కుప్పకూల్చామని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.

పాక్‌కు టిట్ ఫర్ టాట్

అంతకుముందు.. పాకిస్తానే తొలుత ఇండియాపై మిసైల్స్, డ్రోన్స్‌తో అటాక్ చేసే ప్రయత్నం చేసింది. అయితే వాటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంది. S 400 డిఫెన్స్ సిస్టంతో గాల్లోనే వాటిని కుప్పకూల్చేశాయి భారత బలగాలు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్ మిస్సైల్ శిథిలాలు కనిపించాయి.

కామికేజ్ డ్రోన్స్.. సొంత నావిగేషన్

పాక్‌పై దాడిలో దేశీయంగా తయారైన కామికేజ్ డ్రోన్లను భారత్ వాడుతోంది. వాటిని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ తయారు చేసింది. జీపీఎస్ కాకుండా, ఇస్రో అభివృద్ధి చేసిన ‘నావిక్’ నేవిగేషన్‌ వ్యవస్థతో ఈ డ్రోన్లు పని చేస్తాయి. శత్రు రాడార్‌లను, రక్షణ వ్యవస్థలను ఛేదించి.. మల్టిపుల్ టార్గెట్స్‌ను ఛేదించే సత్తా కామికేజ్ డ్రోన్లకు ఉంది. ఏకంగా 1000 కి.మీ. రేంజ్ వరకూ వెళ్లగలవు. 30-40 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. 120 కిలోల బరువు, 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల రెక్కల సైజ్ ఉండే కామికేజ్ డ్రోన్.. పాకిస్తాన్‌పై చేస్తున్న దాడుల్లో గేమ్ ఛేంజర్‌గా నిలిచాయి.

Also Read : ఆపరేషన్ సిందూర్ 2.. ఈసారి అంతకు మించే..

మసూద్ సోదరుడిపై అటాక్?

మరోవైపు, ఇండియన్‌ ఆర్మీ దాడుల్లో.. మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్ట్ మసూద్‌ అజర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ చచ్చినట్టు తెలుస్తోంది. కాందహార్ విమాన హైజాక్ ఘటనలో అతను కీలక సూత్రధారి. ఇప్పుదతడిని లేపేసి.. బదులు తీర్చుకుంది భారత్.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×