Y.Vijaya: వై.విజయ (Y.Vijaya) .. నాటితరమే కాదు నేటి తరానికి కూడా ప్రత్యేకంగా పరిచయం లేని పేరు..ఒకప్పుడు హీరోయిన్గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంవత్సరాలుగా సినిమాలలో అలరిస్తున్న వై.విజయ ఇప్పుడు హీరోలకు బామ్మగా కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు.. గతంలో ఎన్టీఆర్ తో హీరోయిన్గా చేసిన ఈమె ఆ తర్వాత బాలయ్య సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలలో నటించారు. ఇక ఈమధ్య సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటిస్తున్న ఈమె.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ (Sr.NTR) ఫ్యామిలీతో, బాలయ్య(Balakrishna ) కుటుంబంతో తనకున్న మంచి అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.
బాలయ్య కుటుంబంతో సాన్నిహిత్యం పై వై.విజయ కామెంట్స్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా కుటుంబాలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి వై.విజయ మాట్లాడుతూ.. “బాలకృష్ణ , ఎన్టీఆర్ ఫ్యామిలీ అందరితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. నాకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను చెన్నై వెళ్ళిపోయాను. అక్కడే చిన్న వెంపటి సత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకోవడానికి వెళ్తే.. అక్కడికి ఎన్టీఆర్ పిల్లలు కూడా వచ్చేవారు. అక్కడ వాళ్ళతో మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగానే బాలయ్యతో అనేక సినిమాలలో నటించాను. ఒకసారి రాజమండ్రిలో షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ అయ్యాక బాలయ్య అత్తయ్య గారి ఊరు కాకినాడ కావడంతో అక్కడికి డిన్నర్ కి తీసుకెళ్లారు. షూటింగ్లో బాలయ్యతో ఉంటే కనుక ఆయన తన భార్య వసుంధర (Vasundhara), అక్క పురందేశ్వరి (Purandeswariki) కి కాల్ చేసి విజయతో మాట్లాడండి అంటూ నాకు ఫోన్ ఇచ్చేవారు. ఒకసారి చంద్రబాబు (Chandrababu) గారి భార్య భువనేశ్వరి(Bhuvaneswari) ని కూడా నేను సూపర్ మార్కెట్లో కలిశాను. నన్ను గుర్తుపట్టి మరీ ఆవిడ మాట్లాడించారు. ఇంటికి రమ్మని కూడా పిలిచారు అంటూ ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని కూడా పంచుకుంది వై. విజయ. మొత్తానికైతే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా బాగా కలిసిపోతారని, తనను గుర్తు పెట్టుకుంటారని తాను ఊహించలేదు” అంటూ చెప్పుకొచ్చింది.
వై.విజయ ఆస్తుల వివరాలు..
ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో తన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించింది వై విజయ. ఈమె మాట్లాడుతూ..” సీనియర్ యాక్టర్స్ చాలామంది దానధర్మాలు చేసి సేవింగ్స్ చేసుకోక చివరి రోజుల్లో ఏమీ లేకుండా ఇబ్బందులు పడ్డారు. నేను కాస్త సేవింగ్స్ చేసుకున్నాను. హైదరాబాదులో ఏ ఆస్తులు లేవు కానీ చెన్నైలోనే ఎక్కువ కొనుగోలు చేశాను. అక్కడ మూడు ఇల్లులు , ఒక కళ్యాణమండపం, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. ప్రస్తుతం కళ్యాణమండపం, కాంప్లెక్స్ మీద రెంట్స్ వస్తాయి. 1985 నుంచి 2000 సంవత్సరం వరకు నేను బిజీగా సినిమాలు చేయడంతో అప్పుడే సేవింగ్స్ చేశాను. ఇక హైదరాబాదులో కూడా ఒక ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నాను . భవిష్యత్తులో కచ్చితంగా ఒక ఇల్లు హైదరాబాదులో తీసుకుంటాను. ఇక్కడే ఉండి సినిమాలు, సీరియల్స్ లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది వై.విజయ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Akhanda 2: బాలయ్య మూవీలో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ కూతురు.. ఇది కదా కావాల్సింది..!