BigTV English

Lakshadweep : లక్షద్వీప్‌ పై భారత్ వ్యూహాత్మక అడుగులు.. నౌకాదళ స్థావరం ఏర్పాటు..

Lakshadweep : లక్షద్వీప్‌ పై భారత్ వ్యూహాత్మక అడుగులు.. నౌకాదళ స్థావరం ఏర్పాటు..
Navy Base In Lakshadweep
Navy Base In Lakshadweep

New Navy Base In Lakshadweep : లక్షద్వీప్ ఇటీవల వార్తల్లో ఎక్కువగా వినిపించి పేరు. కారణం ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లడమే. సముద్రతీరంలో ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో మల్దీవులపై ఆ ఎఫెక్ట్ పడింది. ఆ దేశానికి వెళ్ల వద్దు.. లక్షద్వీప్ లకు వెళదాం అనే నినాదం ఊపందుకుంది. దేశం మొత్తం లక్షద్వీప్ పేరు మారుమోగింది. అక్కడికి వెళ్లేందుకు సందర్శకులు క్యూ కట్టారు.


ఇప్పుడు లక్షద్వీప్ పై భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాంతంలో నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్యాంపునకు ఐఎన్ఎస్ జటాయు అని నామకరణం చేసింది. ఈ స్థావరం ఏర్పాటుతో హిందూ మహాసముద్రంపై భారత్ నిఘా పెంచనుంది. లక్షద్వీప్ లోని మినికాయ్ ద్వీపంలో భారత్ నౌకాదళ క్యాంపు ఏర్పాటు చేసింది. వచ్చే వారం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ క్యాంపులో ముందు కొంతమంది అధికారులు, సిబ్బంది ఉంటారు. తర్వాత స్థావరం బలాన్ని మరింత పెంచుతారు. దీన్ని అతిపెద్ద నౌకాదళ క్యాంపుగా మార్చాలనేది కేంద్రం ఆలోచన.

విమాన వాహక నౌకలు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య కలిసి తొలిసారిగా ఓ ఈవెంట్ లో భాగస్వామ్యం కాబోతున్నాయి. వీటిపై కమాండర్స్ కాన్ఫెరెన్స్ జరగనుంది. నేవీ యుద్ధ విమానాలు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌పై నుంచి టేకాఫ్‌ అవుతాయి. మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై ల్యాండ్ అవుతాయి. ఇలాంటి హైటెంపో ఆపరేషన్లు నిర్వహిస్తారు. అలాగే జలాంతర్గాములు, యుద్ధ నౌకలు క్యారియర్‌ గ్రూప్‌ కార్యకలాపాల్లో పాల్గొంటాయి. ఈ సమయంలో జటాయును ప్రారంభించనున్నారు.


Read More: షీనా బొరా హత్య కేసులో ఎన్నో ట్విస్టులు .. అసలేం జరిగిందంటే?

దేశానికి తూర్పుతీరంలో అండమాన్‌-నికోబార్‌ ద్వీపాల్లో నౌకాదళ స్థాపరం ఉంది. దీని పేరు ఐఎన్‌ఎస్‌ బాజ్‌. ఇప్పుడు పశ్చిమతీరంలో మరో నౌకాదళ స్థావరం అందుబాటులోకి రానుంది. జటాయు క్యాంపునకు దగ్గరలోనే ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను మోహరిస్తారని తెలుస్తోంది.

మాల్దీవులకు 50 మైళ్ల దూరంలో ఐఎన్‌ఎస్‌ జటాయు ఉంది. హిందూ మహా సముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికలపై నిఘా కోసం ఈ స్థావరాన్ని వినియోగించనున్నారు. ఎంహెచ్‌-60 హెలీకాప్టర్లు దళంలో చేరనున్నాయి. గోవాలో నిర్మించిన నౌకాదళ కాలేజీని ఇదే సమయంలో ప్రారంభించాలని భావిస్తున్నారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×