BigTV English

Awareness: కట్నం తీసుకున్న వాడు గా*ద.. ఈ రూల్ ఇక్కడ వెరీ స్ట్రిక్ట్..

Awareness: కట్నం తీసుకున్న వాడు గా*ద.. ఈ రూల్ ఇక్కడ వెరీ స్ట్రిక్ట్..

Awareness: పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అంటుంటారు. ఇవి రెండు మన లైఫ్ లో పెద్ద కార్యక్రమాలే. అయితే ఇల్లు సంగతి అటుంచితే, పెళ్లి సంగతి మాటెత్తితే మాత్రం ముందుగా మనకు గుర్తొచ్చేది కట్నం. అసలు కట్నంపై నిషేధం ఉన్నప్పటికీ అంతా తూతూమంత్రంగానే అమలవుతోంది. ప్రస్తుతం కట్నం అనేది పెద్ద పీడగా చెప్పవచ్చు. కట్నం ఇచ్చిన కొద్దిరోజులకు వరకట్నం తెరపైకి వచ్చే రోజుల్లో ఉన్నాం. వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న యువతులు ఎందరో. అయితే మన దేశంలోనే కట్నం మాటెత్తితే తరిమి కొట్టే గ్రామాలు ఉన్నాయి. కట్నం అంటే అక్కడ పెళ్లి కూడా జరగదు. ఇంతకు మన దేశంలో కట్నం తీసుకోని ఆ గ్రామాల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.


దేశవ్యాప్తంగా కట్నం బాధితుల కేసులు పెరుగుతున్న ఈ కాలంలో, కొన్ని రాష్ట్రాలు, తెగలు మాత్రం చట్టం కాకుండా సాంస్కృతిక విలువల ద్వారానే కట్నాన్ని ఖండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో వివాహాల్ని మానవీయ సంబంధాలుగా చూసే తత్వం ఇప్పటికీ జీవంగా ఉంది. అందుకే ఇక్కడ అమ్మాయి పుడితే చాలు, అక్కడంతా పండుగ వాతావరణం ఉంటుంది. మరీ ఇక అసలు విషయం లోకి వెళితే..

ఇక్కడ వరుడే కట్నం చెల్లించాలి
మేఘాలయ రాష్ట్రంలోని ఖాసీ, జయంతియా, గరో తెగలు మాతృసత్వ కుటుంబ వ్యవస్థను అనుసరిస్తుంటారు. ఇక్కడ వివాహ సమయంలో వరుడు చిన్న మొత్తంలో బహుమానం ఇస్తాడు, కానీ పెళ్లికూతురు తరపున ఎలాంటి కట్నం ఉండదు. మహిళలకే వారసత్వ హక్కులు ఉంటాయి. భవిష్యత్తులో కుటుంబ బాధ్యతలలో కూడా మహిళలదే కీలక పాత్ర. అందుకే ఇక్కడ మహిళలకు అధిక ప్రాధాన్యత లభిస్తుంది.


కట్నం నిల్.. గిఫ్ట్స్ ఫుల్
మిజోరాంలో మిజో తెగలు మానవీయత ప్రధానంగా ఉన్న సంప్రదాయాలను పాటిస్తారు. వివాహానికి పురుషులు కొన్ని బహుమతులు ఇస్తారు. కానీ ఇది చెలామణీ కోసం గానీ, సంపద కోసం గానీ కాదు. ఇలా బహుమతులు ఇవ్వడం తమ సంప్రదాయం ప్రకారం గౌరవ సూచకంగా మిజో తెగల వారు భావిస్తారు.

కట్నం అంటే పెళ్లికి దూరమే
నాగాలాండ్ లో కట్నం మాటెత్తితే పెళ్ళికి ఇక ఆ వరుడు దూరం కావాల్సిందే. ఇక్కడి తెగలలో పెళ్లి అనేది పరస్పర అంగీకారంతో జరగాలి. కుటుంబాల మధ్య స్నేహబంధాల పునాది మీదే వివాహాలు నడుస్తాయి. కట్నం అనే మాటే ఇక్కడ కనిపించదు.

ఇక్కడ కట్నం తక్కువే..
కేరళ నైయర్ వర్గంలో కుటుంబ పద్ధతి ఉండేది. ఇప్పుడది కొంత మారినప్పటికీ, కట్న పద్ధతులు ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. నేడు కూడా ఇక్కడ మహిళలకు విద్య, ఆర్థిక స్వావలంబనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఇక్కడ కట్నం చాలా తక్కువ. అందుకే వీరు ప్రత్యేక స్థానం పొందారు.

ఇక్కడ నామామాత్రమే..
లడఖ్, సిక్కిం రాష్ట్రాల్లో వివాహాలు చాలా సాధారణంగా, ప్రేమ, పరస్పర గౌరవం ఆధారంగా జరుగుతాయి. కుటుంబాలు పరస్పరం అంగీకరించి, సంబరంగా కాకుండా సౌమ్యంగా జరుపుతారు. ఇక్కడ కూడా కట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం అరుదైనదే. అయితే వివాహ ఖర్చులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి.

Also Read: Telangana Govt: తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. ఇలా చేస్తే.. పథకాలన్నీ కట్..

చట్టం వచ్చింది కానీ,
1961లో భారత ప్రభుత్వం కట్న నిరోధక చట్టంను తీసుకురావడం విశేషం. అయితే, ఇంకా అనేక ప్రాంతాల్లో అది అమలులో మాత్రం వెనుకడుగులోనే ఉంది. చట్టానికి తోడు, సాంస్కృతిక మార్పు, అవగాహన పెరగడమే నిజమైన పరిష్కారం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు చట్టాల కంటే ముందే, సాంప్రదాయ విలువలతోనే కట్నాన్ని నిరాకరిస్తూ జీవిస్తున్నారు. ఇది కొత్త తరానికి మార్గదర్శకం కావాలని, మరింత మార్పు రావాలంటే, ప్రతి మనిషి ఆలోచనల్లోనే కట్న నిషేధం మొదలవ్వాల్సిన భాద్యత ఉంది. చూశారుగా కట్నం మహమ్మారి పేరు ఎత్తకుండా ఎన్ని ప్రాంతాలు నేటికీ మన దేశ వివాహ సంప్రదాయాన్ని గౌరవిస్తున్నాయో.. ఇప్పటికైనా వరకట్న వేధింపులు మాని, మహిళల అభ్యున్నతికి దోహదపడదాం అంటున్నారు మేధావులు. మీరేమంటారో..!

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×